ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గుంటూరు

బంగాళాఖాతం ఒడ్డున, కృష్ణా నదికి కుడి వైపున కొలువుతీరి ఉన్న  గుంటూరు జిల్లాకు దాదాపు 100 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. కృష్ణానది ఆధ్యంతం సముద్రంలో కలిసేంతవరకు   జిల్లగుండా ప్రవహిస్తూగుంటూరు, కృష్ణా జిల్లాలను వేరు చేస్తున్నది.. గుంటూరు పట్టణం జిల్లాలో అతి పెద్ద నగరం . ఇది జిల్లా ప్రధాన కేంద్రంగా, పాలనాధికారాలు చేపట్టే కార్యనిర్వాహక  పట్టణంగా వ్యవహరిస్తున్నది. గుంటూరు మిర్చి ఘాటు అనే నానుడి ఇక్కడ విస్తారంగా పండే  మిరప పంట నుండే వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ విద్య, వ్యాపార, వ్యవసాయ కేంద్రంగా పేరొందిన గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతంలోనే  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మిస్తుండటం  విశేషం.

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా మొత్తం జనాభా 4,887,813. వీరిలో 2,440,521 మంది మగవారు కాగా,  2,447,292 మహిళలున్నారు. జిల్లా అక్షరాస్యత  67.40%.  నాలుగు రెవెన్యూ డివిజన్లు  ఉన్న ఈజిల్లాను పాలనా సౌలభ్యంకొరకు 57 మండలాలు, 57 పంచాయతీ సమితులు, 712 గ్రామాలుగా  విభజించారు. జిల్లాలో మొత్తం 14 పట్టణాలున్నాయి. ఇందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, ఒక సెన్సస్ టౌన్ ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు

తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జిల్లాలో ప్రజలు అన్ని తెలుగు పండుగలను జరుపుకుంటారు. ప్రాచీన చరిత్రగల  గుంటూరు జిల్లాలో పలు చారిత్రిక కట్టడాలు, బౌద్ధవిహారాలు, మసీదులు దర్శనమిస్తుంటాయివాటిలో ప్రముఖమైనవి అమరావతి, బాపట్ల, పొన్నూరు, వినుకొండ, కోటప్పకొండ, ఉండవల్లి గుహలు, గురజాల, మాచెర్ల,, తెనాలి, కొండవీడులు ఉన్నాయి.   ప్రోలయ వేమా రెడ్డి, రాజా వాసిరెడ్డి వంటి ప్రముఖులు పట్టణంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలను,  కోటలును నిర్మించారు.

గుంటూరులోని పునరావస్తుశాఖ వారి మ్యూజియం, అమరావతిలో అతి ప్రాచీన శివాలయం,     మంగళగిరి లో పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఉప్పలపాడులో పక్షుల సంరక్షణ కేంద్రం, కొండవీడు కోట, గుత్తికొండ గుహలు, పొడవైన సముద్రతీరం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.

గుంటూరు జిల్లాప్రధానంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, వ్యవసాయా ఆధారిత పరిశ్రమలకు పేరు పొందినది . .జిల్లాలో వరి, చెరకు, పత్తి  , మిర్చి, పొగాకు . పంటలు అధికంగా ఇక్కడనుండి పొగాకు, మిర్చి వంటి పంటలను ఎగుమతి కూడా చేస్తారు. 40,722 కోట్ల స్థూల ఉత్పత్తితో, ఈ జిల్లా రాష్ట్ర వార్షిక అభివృద్ధికి 9.5%  ఆదాయాన్ని సమకూరుస్తున్నది. ఈ జిల్లాలో తలసరి ఆదాయం కూడా అధికం. ప్రస్తుత దరల సూచీననుసరించి  2013-14 సంవత్సరానికిగాను సగటు తలసరి ఆదాయం  82,026 రూపాయలు .విద్యా, వైద్య, రవాణా రంగాలలో కూడా ఈ జిల్లా గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పవచ్చు. జిల్లా మొత్తంలో 1,274.632 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం, 406 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, శంకర నేత్రాలయం వంటి ప్రభుత్వ, స్వఛ్చ్న్ద సంస్థలు నడిపే వైద్యశాలలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. జిల్లా మొత్తంలో 4709 ప్రాధమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.  

Top