ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

శృంగవరపుకోట మండలం

పేరువెనుక చరిత్ర:

రాచరికం అధికారం చెలాయిస్తున్న కాలమది! రాజులు రోజంతా పరిపాలనా బాధ్యతల్లో తలమునకలై అలసటకు గురైన సమయంలో విశ్రాంతి కోసమని ఓ మంచి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఊరుకు కాస్తంత దూరంగా పచ్చటి పంటపొలాల మధ్య ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. మకాం చేయడానికి వీలుగా ఓ చిన్నకోట కూడా కట్టారు. వారం వారం రాజుగారు రాణిగారితో కలసి సరదాగా తోటకు వచ్చేవారు. ఓ రోజో రెండ్రోజులో ఆ కోటలో విడిది చేసి వెళ్ళేవారు. దాంతో దీన్ని ` రాజుగారు శృంగారానికి వచ్చే కోటగా శృంగవరపు కోటగా పిలిచేవారు. ఇప్పుడా తోట మనకు ఎక్కడా కనిపించదు.

పట్టణం:

శ్రుంగవరపు కోట పట్టణము ఒక నియోజకవర్గమునకు కేంద్రము. ఇది యస్.కోటగా ప్రసిద్ధి పొందినది. అల్లూరి సీతారామరాజు అటవి ప్రాంతమునకు తూర్పు సరిహద్దు పట్టణము. విజయనగరము జిల్లాలో మండలము. వైజాగ్ నుండి అందాల అరకు వెళ్ళునప్పుడు మార్గ మధ్యములో ఉండును. అరకు నకు ఇక్కడ నుండి సుమారు 60 కి.మీ.లు. వైజాగ్ నకు 50 కి.మీ.లు. విజయనగరమునకు 35 కి.మీ.లు. ఈ పట్టణము తూర్పు అల్లూరి సీతారామ రాజు అటవి ప్రాంతమునకు ముఖ ద్వారము. అరకు మరియు అనంతగిరి మండలాల ప్రజలు కనీస జీవన అవసరాలను ఈ పట్టణము ద్వారా సమకూర్చుకొందురు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండలంలో మొత్తం జనాభా 75,917 ఇందులో మగవారి సంఖ్య 37,123, ఆడవారి సంఖ్య 38,794. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 58.02% ఇందులో పురుషులు 68.92% మంది మరియు స్త్రీలు 47.56%.

దేవాలయాలు:

పుణ్యగిరి - పురాతన శివాలయం

సమస్యలు:

  • కానరాని రోడ్డు నిర్వహణ పనులు.
  • అందని హోమియో వైద్యం.
  • ప్రమాదకరంగా వంతెనలు.
  • తీవ్రమైన నీటి కష్టాలు.
శ్రుంగవరపుకోట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి