గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, గురజాల ఒకటి. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 238623. అందులో ఆడవారి సంఖ్య 120745 కాగా మగవారి సంఖ్య 117846 గా నమోదయింది.ఈ నియోజకవర్గంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ. ఈ ప్రాంతంలోని రైతులు వరి, అపరాలు మరియు కాయగూరలు ఎక్కువగా సాగు చేస్తారు.
గురజాల, చారిత్రకంగా చాలా ప్రసిద్ధ గల పట్టణం. హైహయ వంశపు రాజు అలుగురాజు, గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, మాచర్లను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే ఆంధ్ర కురుక్షేత్రంగా పేరుగాంచిన పల్నాటి యుద్ధము.
శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం - పలనాటి ప్రజల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, ప్రజల కొంగుబంగారమై నిత్యం ధూప దీప నైవేద్యాలనందుకుంటున్నది. ఈ అమ్మవారి వార్షిక తిరునాళ్ళు ప్రతి ఏటా ఘనంగా జరుపుతారు.
శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం.
ముక్కామల కృష్ణమూర్తి ఈ ప్రాంతంలో పేరు గాంచిన ప్రముఖుడు.