ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కనీస అవసరాలకు కూడా చోడవరం ప్రజలు ఇంకెన్ని దశాబ్దాలు వేచిచూడాలి?

చోడవరం పట్టణం విశాఖపట్నం జిల్లా కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రంగానూ, అసెంబ్లీ నియోజకవర్గంగానూ చెలామణీఅవుతున్న చోడవరం పట్టణ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 20251. వీరిలో మగవారు 9,868 మంది కాగా, 10,383 మంది మహిళలున్నారు. 77.% అక్షరాస్యత గల చోడవరం పట్టణం, జిల్లా కేంద్రం విశాఖ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో లో ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంమైన చోడవరం ఆటవీ ప్రాంతంతో కూడి, అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులకు దూరంగా ఉన్నది. తుని నుండి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, చీడికాడల మీదుగా కొత్తవలసకు చేరే రైలు మార్గం గత 30 సంవత్సరాలుగా ప్రతిపాదనలో ఉన్నా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు మారుతున్న, కొత్త హామీలే కానీ కార్యాచరణ లేదు. మార్చ్ 2018 నాటికి రైల్వే వారు నిర్వహించిన సర్వే రిపోర్టులు యిక్కడ ప్రతిపాదిత రైల్వే లైను వలన -5 శాతం ఆదాయం వస్తుందని దీనివలన రైల్వే శాఖకు నష్టం వస్తుందని తెలపడంతో, మంజూరయిన రైలు మార్గం కూడా ఇప్పుడు ఆగిపోయింది. గిరిజన ప్రజలు అధికంగా నివసించే ఈ ప్రాంతాలు ఆధునిక సమాజానికి ఆమడదూరంలో బతుకుతున్నాయి. విద్య, వైద్యం ఆరోగ్యం వీరికి అందుబాటులో లేదు. వర్షాకాలంలో ఏజెన్సీ గ్రామాలన్నీ జ్వరంతో, అంటూ వ్యాధులతో ప్రాణాలు కోల్పోవడమే కానీ సకాలంలో వీరు ఆసుపత్రులకు చేరి వైద్యం అందుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఉన్న 30 పడకల ప్రభుత్వాసుపత్రి 50 పడకల ఆస్పత్రిగా మార్చాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. రహదారులు అభివృద్ధి చెందిన ప్రాంతాలు విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలలో అభివృద్ధిని సాదిస్తాయన్నది చారిత్రిక సత్యం. మారుమూల చోడవరం గ్రామాల ప్రజలు కనీస రహదారులు లేక తరచూ ప్రమాదాలకు గురౌతున్నారు. రోడ్ల విస్తరణ కార్యక్రమాలు ఇంతవరకు ఈ ప్రాంతంలోమొదలే కాలేదు అంటే ఈ ప్రాంతం ప్రజల పట్లగల నిర్లక్ష్య వైఖరికి ఇది అడ్డం పడుతుందని చెప్పవచ్చు. ఇక చోడవరం ప్రాంతంలో నీటి సమస్య అన్నిటికంటే ప్రధానమైనది. ఈ ప్రాంతపు తాగునీటి సమస్యలు తీర్చడానికి మొదలైన పెద్దేరు-నర్సీపట్నం సకాలం పూర్తవుతుందన్న నమ్మకం తక్కువ. నిదానంగా నడుస్తున్న పనులే దీనికి కారణం. చోడవరం దగ్గర ప్రకాశం బ్యారేజ్ దిగువకు ప్రవహించే నీటినుండి 4. టీఎంసీల నీటీని నిలువచేసే ఉద్దేశ్యంతో ఒక చెక్ డాం నిర్మించ తలచింది ప్రభుత్వం. ఈ పథకం అనుకున్నట్లుగా పూర్తయితే ఇక్కడి ప్రజలకు కనీసం త్రాగునీటి అవసరాలు తీరుతాయి.

చోడవరం మండలంలో ప్రవహించే పెద్దేరు, శారదా, బొడ్డేరు నదులు ముదుర్తి దగ్గర త్రివేణి సంగమంగా కలుస్తాయి. కానీ, ఇక్కడ ఇసుకతవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నందువల్ల నీళ్లు ఎండిపోతున్నాయి. 1995 నుండి పెద్దచెరువు పై లక్ష్మీపురం లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ ఈనాటికి మొదలు కాకపోవడంతో విలువైన నీరు వృధాగా శారదానదిలో కలిసిపోతున్నది.

చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పట్టణ ప్రాంతాలలో కనీస అక్షరాస్యత పొందిన యువతకు సరైన ఉద్యోగ , ఉఫాధి అవకాశాలు లేక సతమతమవుతుంటే, గ్రామీణ ప్రాంత యువత కనీస విద్య సౌకర్యాలు, జీవనాధారం లేక, దారిద్ర్యం, పోషకాహారలోపం, వ్యాధులు, వలసల బారిన పడుతున్నారు. తీవ్రవాద మూలాలు పెరుగుతున్నాయి అంటే దశాబ్దాలుగా వీరిపట్ల వివక్షత, నిర్లక్ష్య ధోరణే కారణం. ఈ ప్రజలను ఓటర్లుగానే చూడకుండా, కనీస అవసరాలకు నోచుకోని మనుషులుగా చూడాలి. చిన్న పిల్లలు, గర్భిణీలు, ముసలివారు కనీస వైద్యసదుపాయాలు లేక, తీవ్రమైన పోషకాహార లేమితో, అనారోగ్యంతో, నిరుద్యోగంతో దశాబ్దాలుగా ఒత్తిడికిలోనౌతుంటే సభ్యసమాజం మాకేం కాలేదు కదా అని పట్టనట్లు ఉండడం వలన వీళ్ళు పెడమార్గం పట్టె అవకాశాలు లేకపోలేదు.

చోడవరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి