ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

విశాఖ తూర్పులో సమస్యల గ్రహణం వీడాలంటే పౌరులుకూడా అభివృద్ధిపనులలో భాగస్వాములు కావాలి

తూర్పు విశాఖ ప్రాంతంలో ఆరిలోవా, ఆంధ్ర విశ్వ విద్యాలయా ప్రాంగణం, ఎంవీపీకాలని, సాగర్ నగర్ , మద్దెలపాలెం, వంటి ప్రముఖ మైన ప్రాంతాలున్నాయి. వీటిలో ఆరిలోవా, బీచ్ రోడ్, పర్యాటకంగా ప్రసిద్ధిపొందిన ప్రాంతాలైతే, ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సహా, అనేక శాస్త్ర, సాంకేతిక, పరిశోధన మరియు విద్యార్జనకు చిరునామాగా మద్దిలపాలెంను పేర్కొనవచ్చు. ఒక లక్షకు పైగా నగర జనాభాతో, ఆసియా ఖండంలోనే అతిపెద్ద టౌన్ షిప్ గా అవతరించిన ఎంవిపి కాలనీలో. హోటళ్లు, సినిమా థియేటర్లు, అత్యంత ఆధునికమైన ఆడిటోరియంలు, చక్కటి రహదారులతో ఈ ప్రాంతం కైలాసకోనకు చేరువలో ఉంది. 31 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహంతో ఏర్పడిన బుద్ధ వనం, దాని సమీపంలో ఉన్న కైలాసకోన ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి బాటలు వేసే వనరులుగా పేర్కొనవచ్చు. కానీ, ఇన్ని అద్భుత వనరులున్న విశాఖ తూర్పు ప్రాంత అభివృద్ధికి అలసత్వం, నిర్లక్ష్యం, అవగాహనాలేమి అవరోధాలని చెప్పవచ్చు. పచ్చని తూర్పుకనుమల మధ్యలో అమరిన ఆరిలోవా, కైలాసకోనా వంటి ప్రాంతాలలో మురికి, చెత్త పేరుకొనిపోయింది. భూగర్భడ్రైనేజీలు, వీధి దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు, రహదారులు, ఇంకా వ్యక్తిగత భద్రత వంటి అంశాలు లోపించడంతో, అత్యధిక జనావాసాలు గల ఈ ప్రాంతాలన్నీ దుర్గంధభూయిష్టంగా తయారయ్యాయి. రోడ్లపై బహిరంగంగా పేరుకుపోయిన చెత్త చుట్టూ వీధి కుక్కలు, దోమలు, పందులు సైర్యవిహారం చేస్తూ, ఈ ప్రాంతవాసుల అనారోగ్య సమస్యలకు కారణభూతంగా నిలుస్తోంది. కొన్ని వీధులలో చెత్త పారవేసేందుకు తగిన చెత్తకుండీలు లేక, పౌరులు వీధిలోనే యదేచ్చగా చెత్త పారవేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలకు, ఉత్సవాలకు, పోటీలకు వేదికవుతున్న విశాఖ తూర్పులో స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. గతుకులమయమైన రహదారుల నిర్మాణం, నగర పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. నగర పౌరులు చెత్త రహదారులలో పడేయకుండా, భాద్యతాపరులైన పౌరులుగా ఉండాలంటే, వీధులలో చెత్తకుండీలను ఏర్పరచటమే కాకుండా, ఇంటింటికి చెత్తసేకరణ కార్యక్రమం అమలుచేయడంద్వారా, తడి, పొడి చెత్తను వేరు చేసి, వాటినుండి సేంద్రియ ఎరువులు, విద్యుత్తు వంటివి తయారు చేయడానికి మహిళా, యువ సంఘాలను ప్రోత్సహించాలి. తడి, పొడి చెత్తను సేకరించేందుకై స్థానిక నిరుద్యోగులను నియమిస్తే, పరిశుభ్రత, నిరుద్యోగసమస్య రెండింటిని పరిష్కరించిన వారవుతారు. స్థానిక సమస్యలను ప్రజాప్రతినిధులు సమర్ధవంతంగా పరిష్కారించాలంటే ప్రతి వార్డులో, వీధిలో, ఇంకా కాలనీలో ప్రజలు సమిష్టిగా ఏర్పడి, ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికై ఒత్తిడి చెయ్యాలి. పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలనుండి విశాఖపట్నం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు. వాటికంటే మేము భిన్నంగా పనిచెయ్యగలమని నిరూపించుకోవాల్సిన సమయమిది.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి