ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

బాపట్ల నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, బాపట్ల ఒకటి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 171229 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 84323 కాగా ఆడవారి సంఖ్య 86895.

ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ప్రాంతానికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, తర్వాత బాపట్ల గా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకం. చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం సెగ్మెంట్. మొట్టమొదటి ఆంద్ర మహాసభ జరిగింది ఇక్కడే. పత్తి మరియు మిరప ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం - స్థానిక ఎస్.ఎన్.పి.అగ్రహారంలో ఉన్న ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావనారాయణస్వామివారి ఆలయం

సముద్రతీరం - బాపట్లకు సమీపంలోని సూర్యలంక వద్దనున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడే భారత వాయుసేన వారి కేంద్రము కూడా ఉంది. ఇది బాపట్లకు 9 కి.మీ దూరంలో ఉన్న ఓడరేవు మరియు పర్యాటక కేంద్రము.

నియోజకవర్గపు ప్రముఖులు:

నేదురుమల్లి జనార్ధనరెడ్డి  -  డిసెంబర్ 17, 1990 నుండి అక్టోబర్ 9, 1992 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 1998లో ఒకసారి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.

దగ్గుబాటి పురంధరేశ్వరి  -  ఎన్టీ రామారావు కుమారై అయిన ఈమె 14 లోక్సభకు నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది.

నియోజకవర్గపు సమస్యలు:

  • తాగు నీటి సమస్య
  • ఆధునీకరించని రహదారులు
  • డ్రైనేజి వ్యవస్థ బాగులేక, ప్రాంతమంతా మురుగు కంపుతో నిండిపోయింది
  • అధ్వాన పరిస్థితిలో ఉన్న రాంకూరు రోడ్లు
Top