ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సంతకవిటి మండలం

సంతకవిటి శ్రీకాకుళం జిల్లా లోని మండలాల్లో ఒకటి, ఇది  మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన రాజాం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం సంతకవిటి మొత్తం జనాభా 66,893 మంది మొత్తం 56 గ్రామాలు మరియు 34 పంచాయతీలలో విస్తరించింది. జనాభాలో పురుషులు 33,595 మరియు స్త్రీలు 33,298. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 334 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 8.

గ్రామ విశేషాలు

కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామములో సంత జరిగేదట, అందు వలన ఈ గ్రామానికి సంతకవిటి అని పేరు పెట్టారు. ఈ ఊరి జనాభా సుమారు 3,000. వరి ఈ గ్రామపు ప్రధాన పంట. ఈ గ్రామములో ఎక్కువమంది వ్యాపారము చేస్తారు. ఎక్కువమంది కొలిచే దేవుడు శివుడు మరియు అంజనేయుడు (హనుమాన్). గత 10 సంవత్సరాలలో అక్షరాస్యత బాగా పెరిగింది. ఈ మండలములో 51 గ్రామాలు, 18 యమ్.పి.టి.సి లు, 36 పంచాయతీలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప బాలబడి రాజాంలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల రాజాంలో ఉంది. సమీప వైద్య కళాశాల శ్రీకాకుళంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు రాజాంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల రాజాంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి.

ప్రధాన పంటలు: వరి

సమస్యలు

  • మండల కేంద్రం ఒక పెద్ద పల్లెటూరు
  • రోడ్లు లేవు
  • బస్ సౌకర్యం లేదు
  • గ్రామాలలో సీసీ రోడ్లు లేవు
  • వలసలు అధికం
  • ఉపాధి పనులే దిక్కు
రాజాం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి