ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తాగునీళ్లు, సాగునీళ్లు , ఉఫాధి కోసం ఆముదాలవలస ప్రజలు చేస్తున్న ఆందోళనకు స్పందన లేదా?

ఆముదాలవలస పట్టణం శ్రీకాకుళం జిల్లాలో మండల కేంద్రం మరియు రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణ జనాభా 37, 852. మండలం మొత్తం జనాభా 80, 093 కాగా, వీరిలో కేవలం 47 శాతం మంది మాత్రమే పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అధిక శాతం గ్రామీణ ప్రాంత ప్రజలున్న ఈ మండలంలో పట్టణ ప్రాంతపు అక్షరాస్యత 76 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో 64 శాతం మాత్రమే ఉంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అయినప్పటికీ, కేవలం 20% మందికి కూడా భూములు లేవు. 80% కంటే ఎక్కువగా ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.

ఆముదాల వలస అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అనేక ప్రజా సమస్యలున్నాయి. దీనిలో ప్రధానమైనది సాగు, తాగు నీరు. తరాలుగా పాలకులు మంచినీరిస్తామని హామీలిస్తునే ఉన్నా , వాస్తవానికి వీరు గుక్కెడు నీళ్లకోసం గుక్కపట్టి ఏడవల్సిన పరిస్థితి. అలాగని ఈప్రాంతం ఎడారి కాదు. చుట్టూ నాగావళి, వంశధారా, గోస్థనీ వంటి నదులున్నా, ఆ నీళ్లు వీరికి అందుబాటులో లేవు. భూర్జ మండలంలో నారాయణపూర్ బ్యారేజ్కి రెగ్యులేటర్ అమర్చి ఆధునీకరించే పనులు దశాబ్దాలుగా ఆలస్యం అవుతుంది. సర్బు ర్జీ మండలంలో ముంపుకు గురౌతున్న భూముల్ని రక్షించుకోవడం, నాగావళి నది పై పెందుర్తి దగ్గర వంతెన నిర్మించి, ఆ ప్రాంతానికి తాగునీరు అందించడం వీరి ప్రధాన డిమాండ్లు. బలసాల రేవుపై వంతెన నిర్మాణానికై 58 గ్రామాల ప్రజలు గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వరదలొచ్చినప్పుడల్లా నది దాటడం వీరికి పెద్ద సవాలుగా మారుతుంది. ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జీ నిర్మాణం, ఇంకా మూతబడిన సహకార రైతు చక్కర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ కర్మాగారంలో వేలాదిగా కార్మీకులు ఉఫాధి పొందేవారు. అది మూత పడటంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ హక్కులను ఆంద్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపేఐసిసి) కు అప్పగించడంతో ఇక్కడ రైతులు ఆగ్రహం చెందుతున్నారు. భూర్జ మండలంలో నాగావళి, వంశధార నదులను అనుసంధానించి, స్థానికంగా మౌలిక సదుపాయాలూ సమకూర్చకపోతే ప్రజా ప్రతినిధులను క్షమించేది లేదని వీళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. గుక్కెడు నీళ్ళే కదా వాళ్ళు అడిగేది, ఇస్తే సరిపోతుందికదా!. నీళ్లు జీవనాధారం ఇది లేకపోతే శ్రామికులంతా పొట్ట చేత పట్టుకుని వలస పోవలసిందే!

ఆమదాలవలస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి