ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నెలిమర్ల సాగునీటి ప్రాజెక్టులు పరిశ్రమల అభివృద్ధి లో జరిగింది గోరంత జరగాల్సింది ఇంకా కొండంత మిగిలే ఉంది.

విజయనగరం జిల్లాలో చంపావతి నది ఒడ్డునే ఉన్న నెలిమర్ల పట్టణం మండల కేంద్రంగానూ, జనాభా గణన పట్టణంగాను ఇంకా, శాసనసభ నియోజకవర్గంగానూ వ్యవహరిస్తున్నది . దీని సగటు ఎత్తు 190 మీటర్లు. జిల్లా కేంద్రానికి నెలిమర్ల కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం నెలిమర్ల పట్టణ జనాభా 20,498. వీరిలో పురుషులు 48% ఉండగా, స్త్రీలు 52% ఉన్నారు. నెలిమర్ల సగటు అక్షరాస్యత 62%, పురుషుల అక్షరాస్యత 70% మరియు స్త్రీ అక్షరాస్యత 54%. 2011 లో నెల్లిమర్ల మండలం జనాభా 77,031. ఇందులో పురుషుల సంఖ్య 38,225 స్త్రీల సంఖ్య 38,806. నెల్లిమర్ల మండలం సగటు 51% అక్షరాస్యతతో, జాతీయ సగటు కంటేవెనుకబడిఉంది. అందులోనూ, మహిళా అక్షరాస్యతా శాతం (41%) చాలా తక్కువ.

నెల్లిమర్ల జ్యూట్ మిల్లు ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్దది. 1912 లోనే స్థాపించిన జనపనార మిల్లు లో ప్రధానంగా గొనె సంచుల తయారీ చేస్తున్నది. జనపనార మిల్లులు స్థానికుల ఉఫాధికల్పనలో కీలక పాత్ర వహిస్తున్నదని చెప్పవచ్చు. కానీ, గత పదేళ్ల చరిత్ర తిరగేస్తే, ఈ మిల్లు ఎప్పుడు కార్మికుల ఆందోళనలతో, లాకౌట్ వార్తలతో, సమస్యాత్మకంగానే ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర గల ఈ మిల్లును సమర్ధవంతంగా నిర్వహిస్తే, ఆర్ధికంగా వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలకు చేయూతనిస్తుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ భూతంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ఈ దశలో, నెలిమర్ల జనపనార నుండి పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రచారం, ప్రాధాన్యతా కల్పిస్తే, ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది.

2005లోనే చంపావతి నదిపై తలపెట్టిన తారకరామా సాగర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపనజరిగినా, నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అప్పటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 22 కోట్లు. దీనికై ప్రజల నుండి భూసేకరణ జరిగింది. పైపులనేలను కూడా అమర్చారు. కానీ పనిలో పురోగతి లేదు. ఈ ఆనకట్ట పూర్తయితే విజయనగరం జిల్లాలో 25 వేల ఎకరాలకు సాగునీరందిచవచ్చని అంచనా. 2016 నాటికి పూర్తవుతుందని అనుకున్న పనులు పూర్తికాకపోవడంతో నిర్మాణ వ్యయం 400 కోట్లకు పెరిగిపోయింది. విభజన తరువాత ఆంధ్రరాష్ట్రానికి సాగు, తాగు నీటి ప్రాజెక్టులలో ఒక్క పోలవరం ప్రాజెక్టు తప్ప, ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధమైన సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి నిధులు మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీలకనుగుణంగా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి  'వెనుకబడిన జిల్లాలకు ఉద్దేశించిన నిధులను ఇవ్వడంతోబాటు, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడాలి. 2003లో నాగావళి నదిపై ప్రారంభమైన తోటపల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్, 12 ఏళ్ళ నిరీక్షణ తరువాత 2015లో పూర్తయింది. దీనిద్వారా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో  1,20,000 ఎకరాలకు నీరు అందుతుందని అంచనా. కానీ ఈ జిల్లాలో ఇంకా జంజావతి, వెంగళరాయ, మహేంద్ర తనయ, మద్దివలస, వంశధార రెండవ దశ పనులు, మందకోడిగా సాగుతున్నాయి. ఈ అలసత్వం వల్ల నిరసన వ్యయం పెరిగిపోవడంతో బాటు, రైతుల చిరకాల వాంఛయైన సాగునీరు అందక, ఆర్ధిక వెనుకబాటుతనం మరిన్ని వలసలను ప్రోత్సహిస్తుంది.

నెల్లిమర్ల నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి