ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పరిశుభ్రతలో బొబ్బిలి సాధించిన విజయం దేశానికే గర్వకారణం

బొబ్బిలి పట్టణం, జిల్లా కేంద్రమైన విజయనగరానికి 61.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మండల కేంద్రంగా కూడా వ్యవహరిస్తున్న బొబ్బిలిపట్టణం విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. సముద్ర మట్టానికి 337 అడుగుల ఎత్తులో ఉన్న బొబ్బిలి ఉష్ణమండల వాతావరణాన్ని కలిగిఉంటుంది. గాలిలో తేమ, ఎక్కువగా ఉండి, 27డిగ్రీల సగటు ఉష్ణోగ్రతను కలిగిఉంటుంది. ఈ పట్టణం ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం బొబ్బిలి పట్టణ జనాభా 56,819. వీరిలో 28,285 మంది మగవారు కాగా, 28,534 మంది మహిళలతో సమానమైన స్త్రీ పురుష నిష్పత్తిని కలిగి ఉంది. 77 శాతం అక్షరాస్యులతో, ఈ పట్టణం చైతన్య వంతులైన పౌరులు,అభివృద్ధినే పరమావధిగా ఎంచి పనిచేసే పురపాలక సంస్థతో మొత్తం రాష్ట్రానికే మార్గదర్శిగా నిలుస్తున్న పట్టణం అని చెప్పవచ్చు. 2014 అసెంబ్లీ ఎన్నికలలలో ఈ నియోజకవర్గంలో 1,20,173 మంది ఓటర్ల వివరాలు నమోధై ఉంది.  రాష్ట్రంలో అన్ని పురపాలికల మాదిరిగానే, బొబ్బిలి నియోజకవర్గంలో కుడా నీరు, రహదారులు ఇంకా పారిశుద్ధ్యమే ప్రధాన సమస్య.

ఎక్కువమంది అక్షరాస్యులతో కూడిన బొబ్బిలి వీరందరికి తగిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కల్పించలేక పోతున్నది. 1996 నుండి ప్రతిపాదనలో ఉన్న పారిశ్రామిక పార్క్ తరాలు మారి, దశాబ్దాలు గడిచినా ఇంకా పూర్తి కార్యాచరణకు నోచుకోలేదు. 2017 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 467 ఎకరాల భూమి కేటాయించి, రోడ్లు, నీళ్లు, విద్యుత్, ఇంకా టెలిఫోన్ సౌకర్యాలు కల్పించింది. 507 ప్లాట్ లుగా ఈ భూమిని విభజించి, పలు సంస్థలకు కేటాయించినా, కేవలం ఒకటి రెండు ఫెర్రోఅల్లాయిడ్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన చిన్నతరహా సంస్థలు మినహాయించి, పూర్తి స్థాయిలో ఈ సౌకర్యాలను వినియోగించుకుని పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు.

ఈ పరిస్థితిని చక్కదిద్ది మరిన్ని పరిశ్రమలను ఆకర్షించటానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయించింది. ఈ నిధులతో భూగర్భ డ్రైనేజీలు, నీటి సరఫరా, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్లు, పిల్లల సంరక్షణా కేంద్రాలు, వసతి గృహాలు, వాహన పార్కింగ్ సదుపాయాలూ కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. 2019 మార్చ్ లోగా ఈ పారిశ్రామిక పార్క్ అందుబాట్లలోకి వస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిస్తున్నారు. ఇది 5500 మందికి ప్రత్యక్ష ఉఫాధి కల్పించగా, 8500 మందికి పరోక్షంగా ఆదాయం కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

జనపనార మిల్లులకు బొబ్బిలి ప్రసిద్ది. ప్రస్తుతం అనేక జనపనార మిల్లులు మూతపడటం వలన అనేకమంది కార్మికులు ఉపాది కోల్పొయారు. ఇక్కడ పనిచేసినవారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. కనీస వసతులు లేక బడులు, కళాశాలలు నిరుపయోగం అవుతున్నాయి. తాగునీరు, సాగునీరు సమస్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన రైతులు దిక్కుతోచక వలస మార్గం పట్టారు. ప్రాధమిక, హైస్కూల్ ఇంకా ఉన్నత విద్యాభివృద్ధికి కావాల్సిన సదుపాయాలను ఆధునీకరించి, పునరుద్ధరించాలి. గురుకుల పాఠశాలలు ఈ ప్రాంతపు బీద, అల్ఫాఆధాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు చదువుకునే అవకాశాలు మెరుగుపరచగలదు సువర్ణముఖీ నది పై నిర్మించతలపెట్టిన ఆనకట్ట నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి, వెంగళరాయ, తోటపల్లి ప్రాజెక్టులను ఆధునీకరిస్తే, సాగు, తాగునీరు అందుతుంది. రాష్ట్రంలోనే మున్సిపాలిటీలన్నిటికి ఆదర్శప్రాయంగా బొబ్బిలి మున్సిపాలిటీ ప్లాస్టిక్ వాడకాన్ని పదేళ్ళముందే పూర్తిగా నిషేధించి, ఘన వ్యర్ధాల నిర్వాహణలో అత్యంత సమర్ధంగా పనిచేస్తున్నది. తడి పొడి చెత్తను సేకరించి, సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ ఉత్పత్తి చేసి, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడంతో బాటు, స్థానికులకు ఉఫాధికల్పనలో కూడా ముందుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని బొబ్బిలి ప్రజలు పారిశ్రామిక, విద్యాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం.

బొబ్బిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి