పల్నాటి రాజకీయాలకు కేంద్ర బిందువు, నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం. నరసరావుపేటను పలనాడుకు ముఖద్వారంగా అభివర్ణించారు. జిల్లా లోని నాలుగు రెవెన్యూ డివిజను కేంద్రాలలో ఇది ఒకటి. నరసరావుపేట, వాణిజ్యకేంద్రంగా మరియు విద్యా కేంద్రంగా జిల్లాలో ప్రముఖమైన స్థానం పొందింది. అంతేకాక రాష్ట్ర రాజకీయాలకు ప్రసిద్ధి ఈ నియోజకవర్గం.
ఈ ప్రాంతం పేరు తొలుత అట్లూరు. అట్లూరుగా మొదలైన ప్రస్థానం "నరసింహారావుపేట"గా కొనసాగి, నరసరావుపేట"గా వాసికెక్కినది. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 195927 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 99084 కాగా మగవారి సంఖ్య 96830. ఇక్కడి రైతులు సాగునీరు అందక, పత్తి మరియు మిరప వైపు మొగ్గు చూపుతున్నారు.
త్రికోటేశ్వర స్వామి దేవాలయం - ఇక్కడకి సమీపంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి దేవాలయం 12 కి మీల దూరంలో ఉంది. ఆ అలయంలో శివుడ్ని త్రికొటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.
శ్రీ రాధా గోవిందచంద్ర మందిరం (ఇస్కాన్ మందిరం).