ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అనకాపల్లి మండలం

అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, ఉక్కునగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి కొబ్బరి వ్యాపారానికి మరియు బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.

అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.

ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.

ఆలయాలు

అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం

అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాతి కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాదికి ము౦దుగా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.

'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.

అనకాపల్లి పట్టణానికి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.

అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.

పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని దేవీపురంలో శ్రీచక్రాకృతిలో విర్మించబడిన రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి చెందినది.

  • కమాక్షి ఆలయము
  • గౌరీ పరమేశ్వరాలయము
  • పెదరామస్వామి ఆలయం
  • చిన్నరామస్వామి ఆలయం
  • వెంకటేశ్వరస్వామి ఆలయం
  • సంతోషీమాత ఆలయం
  • కన్యకా పరమేశ్వరి ఆలయం
  • కాశీ విశ్వనాధ స్వామి ఆలయం
  • భోగ లింగేశ్వర ఆలయం
  • గాంధీ నగరం వెంకటేశ్వరస్వామి ఆలయం

పరిశ్రమలు, వ్యాపారం

ఆనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది.

అనకా పల్లి సమీపంలో 'వెలగపూడి స్టీల్ మిల్స్' అనే ఉక్కు పరిశ్రమ ఉంది.

అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో 'అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం' ఉంది.

చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (సుమారు 15 కి.మీ.)

అభివృద్ధి చర్యలు:

2020 నాటికి బైపాస్ రహదారిని నిర్మించడానికి సంకల్పించి, భారీగా రోడ్డు పనులు మొదలుపెట్టారు

ఈ పట్టణ సమస్యలు:

  • పురపాలక సంఘంగా అప్ గ్రేడ్ చేసి పన్నులు పెంచేశారు
  • ఉపాధి హామీ లేకుండా పోయింది 
  • దోమల సమస్య తీవ్రంగా ఉంది 
  • డంపింగ్ యార్డు పట్టణం మధ్యలోనే ఉంది 
  • తాగునీటి సమస్య తీవ్రతరం 
  • కండకర్ల ఆవను ఆక్రమణల నుంచి కాపాడి సహజత్వాన్ని తీసుకురావాలి. పర్యాటకంగా తీర్చి దిద్దాలి 
  • తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరించాలి 
  • రెండేళ్లుగా ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్న షాపింగ్ కాంప్లెక్సుకు మోక్షం కలిగించాలి 
  • చెరుకు, బెల్లం రైతులను ఆదుకోవాలి 
  • రైతులకు పోలవరం నీరు ఇవ్వాలి 
  • ఇసుక మాఫియాను అడ్డుకోవాలి 
  • రైల్వే స్టేషన్ ఆధునీకరించాలి 
  • బొజ్జన్నకొండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి 
  • తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి  
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి