ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నర్సీపట్నం మండలం

నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర 'పట్నం' ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న 'పట్నాలు' అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే. నర్సీ పట్నం నుండి ఎటు వెళ్ళినా ఏజన్సీ యే వస్తుంది కాబట్టి 'గేట్ వే ఆఫ్ ఏజన్సీ'గా పిలవబడుతూ ఉంది. చారిత్రక విషయంలో పట్నం లోని పోలీస్ స్టేషను 1922 ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టడం, అదే పోలీస్ స్టేషను ఇప్పటికి గుర్తుగా ఉంది. పెద్దగా మార్పులు చేయ లేదు. బ్రిటిష్ కాలం నాటి తాలుకా ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లు చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. సివిల్ సర్వెంట్స్ గా ఉన్న అనేక మంది ప్రసిద్దులకు ప్రారంభం ఇక్కడే కావడంతో సివిల్ సర్వెంట్స్ పై ఉపమన్యు చటర్జీ వ్రాసిన ఇంగ్లీష్ ఆగస్టు నవలను సినిమా తీయడం ఇక్కడే జరిగింది.

ఇది పురపాలక విభాగ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. నర్సీపట్నం నుండి సమీప రైల్వేస్టేషన్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ పురపాలక విభాగ కేంద్రం ఉంది. అందుకని మద్రాసు-హౌరా రైలు మార్గంలో వెళ్ళే మెయిలుబండి నర్సీపట్నంరోడ్డు స్టేషనులో తప్పకుండా ఆగేది. ప్రస్తుతం ఒక బస్సు కాంప్లెక్స్ ఉంది.

విశాఖపట్నం జిల్లా ప్రధానకార్యాలయం నుండి నర్సీపట్నం పశ్చిమాన 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. నరసపట్నంకు సమీపంలోని గ్రామాలు బలిఘట్టం, ఆర్డినరీ లక్ష్మిపురం, పేద బొద్దేపల్లె, గుండుపాల, నీలంపేట. నర్సీపట్నంలో ఉత్తర దిశగా రోలుగుంట మండలం, తూర్పు వైపు మాకవరపాలెం మండలం, దక్షిణ దిశగా కోటవురట్ల మండలం, పశ్చిమం వైపుగా గొలుగొండ మండలాలు ఉన్నాయి.

ఈ పట్టణ సమస్యలు:

  • తాగునీటికి కటకట
  • తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు వస్తోంది 
  • మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి 
  • రైతు బజారు కావాలి 
  • నర్శీపట్నం - విశాఖ మధ్య నాలుగు లైన్ల రోడ్డు వేయాలి 
  • రంగురాళ్ల తవ్వకం అధికారికంగా చేపట్టి సొసైటీలకు ఉపాధి కల్పించాలి 
  • పురపాలక సంఘం చేయడం వల్ల ఇంటి పన్నులు పెరిగిపోయాయి.  వీటిని తగ్గించాలి 
  • పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి 
  • పరిశ్రమలు నెలకొల్పాలి 
  • ఔత్సాహికులకు బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించాలి 
  • జీడి పిక్కల పరిశ్రమల్లో పని చేసే వారికి కనీస వసతులు కల్పించాలి
  • ఈ రంగంలోని కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేయాలి 
  • ఉపాధి హామీ పథకం పురపాలక సంఘాలకు వర్తింపజేయాలి 
  • సామాజిక మరుగుదొడ్లు కట్టించాలి 
  • అన్ని బస్టాండుల్లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి
  • బాల్య వివాహాలు అరికట్టాలి 
  • స్కిల్ డెవలప్-మెంట్ ప్రోగ్రాం చేపట్టాలి 
  • ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి 
  • ఇంకుడు గోతులు తవ్వాలి 
నర్సీపట్నం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి