ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రేపల్లె నియోజకవర్గం

రేపల్లె శాసనసభ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. వైపు సముద్రం మరోవైపు మడ అడవులు ఇంకోవైపు కృష్ణా నదితో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రాంతం. సహజసిద్ధమైన అందాలను ఉపయోగించుకుంటూ మంచి టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దె అవకాశం ఉంది.

నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 209371 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 105296 కాగా మగవారి సంఖ్య 104044. నియోజకవర్గ పరిధిలో పత్తి మరియు మిరప ఎక్కువగా సాగు చేస్తారు

ప్రసిద్ధ ప్రదేశాలు:

పెనుమూడి గ్రామం వద్ద ఉన్న కృష్ణా నది ఒడ్డు.

మోర్తోట వద్ద ఉన్న శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం.

నియోజకవర్గపు ప్రముఖులు:

కొటారు బాల భారతి.

ఇంకొల్లు వెంకటేశ్వరరావు, బాల సాహిత్యకారుడు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

నియోజకవర్గపు సమస్యలు:

  • సాగునీరు అందక అల్లాడుతున్న చివరి భూముల రైతులు.
  • రేపల్లె టౌన్ లో ఇరుకు రోడ్లు, సరిగా లేని డ్రైనేజితో ప్రజలు సతమతమవుతున్నారు.
  • నాణ్యత లేక నియోజకవర్గంలో చాలా చోట్ల సిసి రోడ్లు వేసిన కొద్ది రోజులకే అవి రూపు మారిపోతున్నాయి అంటున్నారు ఇక్కడి ప్రజలు.
  • నిజాంపట్నం మత్సకారులకు వేట కోసం జట్టీలు ఇస్తానన్న హామీ ఇంతవరకు నెరవేరలేదు.
  • మండలంలో సైతం, విద్యా వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Top