ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆర్ధిక, సాంకేతిక అనుకూలతలున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకుంటున్న అంశాలేవీ?

తూర్పుకనుమలకు, బంగాళాఖాత తీరప్రాంతం మధ్య, సముద్రమట్టానికి 72 అడుగుల ఎత్తులో ఉన్న విశాఖమహానగరం ఉష్ణమండల వాతావరం కలిగి, గాలిలో అధికమైన తేమ లేదా పొడి వాతావరణాన్ని కలిగిఉంటుంది. నైరుతీ, ఈశాన్య ఋతుపవనాలనుండి సాలీనా ఈ నగరంలో 1,118.8 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. 19 వ శతాబ్దపు మొదటి భాగంలో ఒక చిన్న తీరప్రాంత బెస్తవారి పల్లెగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విశాఖ పట్టణం, పొరుగునే ఉన్న పట్టణ ప్రాంతాలైన ద్వారకానగర్, గాజువాక, గోపాలపట్నం, జగదాంబా సెంటర్, మద్ది పాలెం, మధురవాడలతోబాటుగా, గ్రామీణ ప్రాంతాలైన సింహాచలం, పెందుర్తి, ఇంకా పరవాడలను కలుపుకొని కాలక్రమేణా మహా నగరంగా ఆవిర్భవించింది.

2011 జనాభాలెక్కల ప్రకారం విశాఖ నగర జనాభా 1,728,128. దీనిలో మగవారి సంఖ్య 873,599 కాగా, మహిళల సంఖ్య 854,529. ప్రతి వెయ్యి మంది మగవారికి 978 మంది మహిళలున్న జనాభాలో సగటు అక్షరాస్యత 81.79%. నగరంలో 1,279,137 మంది చదువుకున్నవారు ఉన్నారు.. వీరిలో 688,678 మగవారు 590,459 మహిళా అక్షరాస్యులున్నారు. 2018 నాటికి విశాఖపట్నం జనాభా 2,035,922 కు చేరుకుందని అంచనా.

ఉత్తర విశాఖ పట్నం:

2009వ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖ నార్త్ నియోజనవర్గంలో 142,643 ఓట్లు (67%) నమోదయ్యాయి. ఈ నియోజకవర్గం పరిధిలో సీతంపేట/అక్కయ్యపాలెం , సీతమ్మధార, మురళీనగర్, మాధవదారా, కంచరపాలెం , తాటిచెట్లపాలెం ప్రాంతాలు ప్రధాన నివాస, ఆర్థిక, వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసముంటున్న సీతంపేట విశాఖనగరానికి ప్రధాన కూడలిగా చెప్పవచ్చు. ఎందుకంటె, ఈ ప్రాంతం ద్వారకా బస్సు స్టేషన్స్ అతిదగ్గరగా ఉండటంతోబాటు, 16 వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానమై ఉండటం వలన ఇక్కడినుండి నగరంలోని ఇతర ప్రముఖమైన ప్రదేశాలయిన గాజువాక, పెందుర్తి, మద్దిపాలెం వంటి ప్రాంతాలకు సులభంగా చేరవచ్చు. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో విశాఖ నార్త్ పరిధిలో కొన్ని కొన్ని మార్పులు అవసరం. ప్రధానంగా, ప్రజలలో ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్ ఫ్రీ జోన్ , పారిశుద్ద్యం వంటి అంశాలలో అవగాహన కల్పించాలి.

రాష్ట్రవిభజన తరువాత ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి విశాఖనగరం ప్రధాన వాణిజ్య నగరంగా ఆవిర్భవించింది. బ్లాక్ చైన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన బహుళజాతి సంస్థలు అనేకం ఈ వాణిజ్య రాజధానిలో కొలువైనాయి. ప్రధానంగా ఫిన్-టెక్ (ఫైనాన్స్ ఇంకా టెక్నాలజీ సమ్మిళితమై) సంస్థలు అధికసంఖ్యలో ఈ ప్రాంతానికి వచ్చి, వ్యాపార కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంది. ఈ సంస్థల వలన చదువుకున్న స్థానిక యువతకు విద్యావకాశాలు మెరుగౌతాయి. కానీ, దేశ, విదేశాలనుండి నిపుణులు ఇక్కడికి వచ్చి పనిచేసేందుకై తగినన్ని వసతి, భోజన, విశ్రాంతి సదుపాయాలూ లేవు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ స్థిరపడాలంటే, నాణ్యమైన సేవలనందించే మౌలికవసతుల కల్పన జరగాలి.

ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టుబడిదారుల సదస్సులను విశాఖనగరంలో నిర్వహిస్తున్నది. ఈ సదస్సులలో వేలకోట్ల డాలర్లతో పెట్టుబడికి ముందుకు వస్తున్నట్లు విదేశీ సంస్థలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చు కుంటున్నాయి. కానీ, ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చాలంటే, స్థలసేకరణ, మౌలిక వసతుల కల్పన, తీరప్రాంతాలలో నౌకాశ్రయాలు ఆధునీకరణ వంటివి జరగాలి. పోర్టుల ఆధునీకరణకు, స్థలసేకరణకు విశాఖ ప్రాంత స్థానికులనుడి అభ్యంతరం తలెత్తున్న పరిస్థితులలో, రాష్ట్ర ప్రభుత్వం స్థలం చౌకగా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మారుమూల ఉత్తరాంధ్ర ప్రాంతాలకూ విస్తరించాలి. దీనివలన ఆర్ధిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలను నివారించవచ్చు.

శరవేగంతో నారీకరణకు గురౌతున్న విశాఖ నగరానికి కాలుష్యం, రహదారుల విస్తరణపై, తాగునీరు, ఇంకా ప్రజాజీవనాన్ని మెరుగుపర్చే సదుపాయాలైన ఆసుపత్రులు, పాఠశాలలు, ఉద్యోగ, ఉఫాధి అవకాశాలనందించే వృత్తి విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు అవసరం. చివరగా, పర్యాటకాభివృద్దికి అనుకూలమైన అనేక ప్రాంతాలున్న విశాఖ నార్త్ నియోజకవర్గం అభివృద్ది సాధించాలంటే, ఈ ప్రాంతాల గురించిన ప్రచారంతో బాటు, అక్కడి మౌలిక సౌకర్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి