గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి ముఖ ద్వారం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. అంతేకాక పచ్చదనానికి మారుపేరుగా చెప్పుకుంటారు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్ర సమర యోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఈ ప్రాంతానికి చెందిన వాడే.
ఈ నియోజకవర్గపు పరిధిలో 209496 ఓటర్లు ఉన్నారు. అందులో ఆడవారు 105290 కాగా మగవారు 104192 గా నమోదయ్యారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప మరియు ప్రత్తి విరివిగా పండిస్తారు.
శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి ఆలయం