గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, గుంటూరు పశ్చిమ ఒకటి. ఈ ప్రాంతానికి అతి పురాతన చరిత్ర ఉంది. పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది ఈ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో, ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది.
గుంటూరు యొక్క ప్రాచీన నామము గర్తపురి. ఈ నియోజకవర్గంలో ఒక లక్షా 60వేల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములు బ్రాహ్మణ ఓటర్లు నిర్ణయిస్తారని వినికిడి. వరి, పొగాకు, పత్తి మరియు మిర్చి ఇక్కడి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. వలస పక్షుల కేంద్రమైన ఉప్పలపాడు మరియు పెదకాకాని ఇక్కడి ప్రసిద్ధ ప్రదేశాలు. మహాభారతం రచించిన తిక్కన సోమయాజి ఈ ప్రాంతానికి చెందిన వారే.
షేక్ గాలీబ్ సాహెబ్ - స్వాతంత్ర్య సమర యోధుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు
పెద్దిభొట్ల సుబ్బరామయ్య