ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మంగళగిరి నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, మంగళగిరి ఒకటిమంగళగిరి అనగానే పానకాల స్వామి స్మరణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం మరియు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గం. ప్రాచీన కాలం నుండి, మంగళగిరి చేనేతకు మరియు వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. పత్తి మరియు మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు ఇక్కడి రైతులు. నియోజకవర్గం ఆలయాలకు ప్రసిద్ధి.

నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 232396 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 117790 కాగా మగవారి సంఖ్య 114587. బీసి ఓటర్లే ఇక్కడ నిర్ణాయక శక్తిగా ఉన్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది.

గాలిగోపురం - మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. ఇది రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.

పెద్ద కోనేరు - మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి.

ఉండవల్లి గుహలు.

నియోజకవర్గపు ప్రముఖులు:

కైవారం బాలాంబ

నియోజకవర్గపు సమస్యలు:

  • విపరీతంగా పెరిగిన ట్రాఫిక్, ఇరుకు రోడ్లతో నరకం చూస్తున్న ప్రజలు.
  • సైడ్ కాలువలు సరిగ్గా లేక, రోడ్ల మీదే మురుగు పారుతుంది.
  • ఎంతో పేరు గాంచిన టీబీ శానిటోరియం, ఇప్పుడు శిథిలావస్థకు చేరింది.
  • దుగ్గిరాల పసుపు రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు.
  • చేనేత కార్మికులకు పిన్షన్లు రుణాలు లేక ఇబ్బంది పడుతున్నారు.
Top