ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాజాం మండలం

రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది పురపాలక సంఘంగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు). 2011 జనాభా లెక్కల ప్రకారం రాజాం జనాభా  94,039. వీరిలో పురుషులు 47,017 గాను స్త్రీలు 47,022 గా ఉన్నారు. ఇది  శ్రీకాకుళం నుండి పశ్చిమాన 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాజాం మండలంకు   దక్షిణంగా జి.సిగిడం  మండలం , ఉత్తర దిశగా ఉన్న రేగిడిఆమదాలవలస  మండలం , పశ్చిమాన తెర్లం మండలం , తూర్పు వైపు సంతకవిటి  మండలం   సరిహద్దులుగా ఉన్నాయి. అమడలవాలాస , శ్రీకాకుళం , బొబ్బిలి లు రాజాంకి సమీపంలోని నగరాలు.        

రాజమంలో 33 గ్రామాలు మరియు 21 పంచాయితీలు ఉన్నాయి. రామనుజలపేట అనేది చిన్న గ్రామం మరియు పోగిరి అతిపెద్ద గ్రామం. ఈ స్థలం శ్రీకాకుళం జిల్లా మరియు విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది. విజయనగరం జిల్లా థర్లామ్ ఈ ప్రదేశం వైపుగా ఉంది.

పట్టణం గురించి

బొబ్బిలి యుద్ధం గాథకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల తాండ్ర పాపారాయుడుకి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయట పడింది. పూర్వ కాలంలో తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని నేడు తహసీల్దారు కార్యాలయంగా వాడుతున్నారు.

సమస్యలు:

 • ప్రధాన రహదారుల విస్తరణ చేయాలి
 • రైతు బజారు కావాలి
 • తాండ్ర పాపారాయుడు కదిలాడిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధిచేయాలి.
 • విగ్రహం ఏర్పాటు చేయాలి
 • తాగునీటి సమస్య అధికం
 • 30 వరకు ఫ్యాక్టరీలు ఉన్నా దాదాపు అన్నీ మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు
 • 8 జ్యూట్ మిల్లులకు గానూ 4 మూతపడి వున్నాయి
 • ఈఎస్ఐ ఆసుపత్రి నెలకొల్పాలి
 • సిగడాం-రాజాం, బొబ్బిలి-రాజాం, పొందూరు-రాజాం ఏదో ఒక ప్రాంతం నుంచి రైల్వే లైన్ కావాలి
 • సిగడాం-రాజాం (15 కి.మీ.), పొందూరు రాజాం (12 కి.మీ.) రైల్వే లైన్ కు అనుకూలం.
 • రూ.60 లక్షలతో సర్వే కూడా నిర్వహించారు.
 • ఉంగరాడ, అప్పడాలను కుటీర పరిశ్రమగా గుర్తించాలి
 • వంశధార నాగావళి అనుసంధానం చేయాలి
 • సవర భాషపై పాఠ్య పుస్తకాలు ముద్రించాలి
రాజాం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి