ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

టెక్కలి మండలం

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నుండి  50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభకి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇది ఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము.

పేరు వెనక చరిత్ర

టెక్కలి ప్రాంతం 1816 నుండి 1832 వరకు పర్లాకిమిడిరాజు గణపతి పద్మనాభదేవ్ పాలనలో వుండేది. అతని కుమారులు ఆ రాజ్యాన్ని రెండుగా విభజించి టెక్కలిని గోవిందనాథ్ దేవ్, నందిగాం ను కృష్ణ చంద్రదేవ్ లు పాలించారు. టెక్కలి పాలకుడు గోవింద నాథ్ దేవ్ తన కుమార్తెకు వివాహము జరిపించినప్పుడు పసుపు,కుంకుమల క్రింద టెక్కలి గ్రామాన్ని దారా దత్తం చేశాడు. టిక్లి అనగా ఒడియాలో పసుపు,కుంకుమల బుట్ట అని అర్థం అలా ఆ గ్రామాన్ని టిక్లి అని పిలిచేవారు. కాల క్రమంలో అది టెక్కలిగా రూపాంతరం పొందింది.

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం టెక్కిలీ మొత్తం జనాభా 28631. వారిలో పురుషులు 13934 మరియు స్త్రీలు 5699,14697 ఇళ్లలో నివసిస్తున్నారు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 2931

విద్యా సౌకర్యాలు

ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం, ప్రభుత్వ-సహాయం మరియు ప్రైవేటు పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ కింద ప్రారంభించాయి .బోధన మాధ్యమం తరువాత వివిధ పాఠశాలలు ఇంగ్లీష్ మరియు తెలుగు.

సమస్యలు

 • తాగు నీటి సమస్య
 • బాలకార్మికుల సమస్య అధికం (కండ్ర వీధిలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు పిల్లలను అధికంగా కనడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని స్థానికుల ఆవేదన)
 • గ్రానైట్ కార్మికులకు భద్రత లేదు, ప్రమాదకర స్థితిలో పని చేస్తున్నారు
 • థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల వలస పక్షులు తగ్గిపోతున్నాయి
 • పనికి ఆహార పథకం పేరుతో చెరువులు తవ్వేస్తున్నారు. దీంతో తేలినేలాపురానికి వచ్చే వలస పక్షుల సంఖ్య తగ్గిపోతుంది. వలస పక్షులకు ఆహార సమస్య ఎదురవుతోంది.
 • మదనగోపాలా సాగరం పూడీక తీస్తే 300 ఎకరాలకు సాగునీరు అందుతుంది
 • మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బావనపాడు హర్బర్ నిర్మించాలి
 • పోర్ట్ కాలుష్యం కారణంగా మత్స్య సంపదకి, స్థానిక ప్రజల జీవనానికి ముప్పు రాకుండా చూడాలి.
 • రావివలస, శ్యామసుందరపురం (జగతిమెట్ట) ల్లోని శైవ క్షేత్రాలలో మరిన్ని వసతులు కల్పించాలి
 • తేలినీలాపురంలొని పక్షుల కేంద్రాన్ని పరిరక్షించాలి
 • టెక్కలి పట్టణం. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దేవాదాయ శాఖ భూముల సమస్యకు పరిష్కారం చూపి దానిపై ఆధారపడి బతుకుతున్న కౌలుదారులు రైతులను ఆదుకోవాలి

ప్రముఖులు

 • కేసిరాజు శ్రీనివాస్
 • కన్నేపల్లి చలమయ్య - ప్రముఖ కథారచయిత
టెక్కలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి