ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అనంతగిరి మండలం

అనంతగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామం. అనంతగిరి, వైజాగ్ మరియు అరకు వాలీ మధ్య ఒక చిన్న హిల్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. చుట్టుప్రక్కల ఉన్న కొండలను ముసి నది జన్మస్థలంగా చెపుతారు, ఇది కృష్ణుడు యొక్క ఉపనది. ఈ కొండల్లో ఎన్నో ప్రాచీన గుహ వంటి నిర్మాణాలు మరియు స్నానం చేయడానికి అనేక కనుమలు ఉన్నాయి. అనంతగిరి హిల్ రిసార్ట్ వైజాగ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దీని ప్రత్యేకతలు

 • అనంతగిరి కాఫీ ప్రేమికులకు మరియు ప్రకృతి ప్రియులకు స్వర్గం
 • ఈ ప్రాంతంలో భారీ జలపాతాలు ఉన్నాయి
 • ఔషధ మరియు మూలికా మొక్కలు చాలా విరివిగా లభిస్తాయి
 • పర్యాటక సందర్శనకు, భావనాసి అను పవిత్రమైన సరస్సు ఉంది.

ఈ పట్టణ సమస్యలు

 • రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న మండలం ఇది. కేవలం 26 శాతం మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు.
 • మండలంలో 156 పాఠశాలలకు కేవలం వంద పాఠశాలలు పని చేస్తున్నాయి
 • ఉపాధ్యాయులు పాఠశాలలకు సరిగా వెళ్లడం లేదు. వీరంతా యస్.కోటలో యల్.ఐ.సి. ఏజెంట్లుగా పని చేసుకుంటున్నారు
 • మాస్టర్లు పాఠాలు చెప్పలేకపోవడం, బడికి వెళ్ళకపోవడం వల్ల నిరక్ష్యరాస్యత పెరిగిపోతుంది
 • జూనియర్ కాలేజీలో గదుల సంఖ్య పెంచాలి
 • హాస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపరచాలి
 • టీచర్లు, డాక్టర్లు ప్రభుత్వ సిబ్బందికి స్థానికంగా వసతి కల్పించాలి
 • డాక్టర్లు అందుబాటలో ఉండటం లేదు
 • నీరు పుష్కలంగా ఉంది. నీటి శుద్ధి చేసి ఇవ్వడం లేదు. మండలంలో 24 పంచాయితీలకు పరిశుభ్రమైన నీరు అందించాలి
 • పెదబిడ్డ వద్ద మినీ రిజర్వాయర్ కట్టాలి. అక్కడ మూడు గెడ్డల నీరు కలుస్తుంది. దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తి అయ్యింది.
 • 24 పంచాయితీలలో చెక్ డ్యామ్ లు కట్టాలి. ఇక్కడ నీరు రైవాడ, తాడిపూడి జలాశయాలకు వెళ్తుంది
 • ఏపీ టూరిజం ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం ఏజెన్సీకి ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నా అది పాటించడం లేదు. గిరిజనులను వాడుకుంటున్నారు. పర్యాటకం పేరుతో హత్యలు జరుగుతున్నాయి. మండలంలో అయిదు పంచాయితీలను నాన్ షెడ్యూల్ కింద చూపించి అన్యాయం చేశారు. ఆ పంచాయితీలలో 99 శాతం గిరిజనులు ఉన్నారు.
 • ఏజెన్సీలో బాక్సైట్, మైకా, ఇసుక ఉంది. ఇసుక క్వారీలు గిరిజనులకు ఇవ్వాలి. ఇక్కడ వారికి ఉపాధి కల్పించాలి.
 • బాక్సైట్ తవ్వకాలపై పూర్తిగా నిషేధం విధించి, గిరిజనులకు న్యాయం చేయాలి.
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి