ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఇచ్ఛాపురం మండలం

ఇచ్చాపురం ఒక మునిసిపాలిటీ విభాగం ( స్థానిక స్వీయ ప్రభుత్వం), శాసనసభ నియోజకవర్గము మరియు మండల కేంద్రము. పట్టణం యొక్క మున్సిపల్ కమిషనర్(స్థానిక స్వీయ ప్రభుత్వ అధికారి) సి.హెచ్ . సత్యన్నారాయణ .ఈ పట్టణం జిల్లా రాజధాని శ్రీకాకుళం నుండి దాదాపు 142 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాలల సరిహద్దు పట్టణము. తూరుపు వైపున అంతా సముద్రతీరము. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత, ఇచ్ఛాపురాన్ని ఆంద్రప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఇక్కడ ఉంది.

ఇచ్చాపురం బహుడా నది ఒడ్డున ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం , పట్టణంలో 36,493 మంది పౌరులు నివసిస్తున్నారు.ఇచ్చాపురం సగటు అక్షరాస్యత 71.12% ను కలిగి ఉంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారి పరిధిలో జాతీయ రహదారి 16 , పట్టణానికి బైపాస్ గా ఉంది.

ఇచ్చాపురం లోని పర్యాటక ప్రదేశాలు

శుద్ధికొండ త్రినాధస్వామి ఆలయం

ఇచ్ఛాపురం లోని బెల్లువడ గ్రామంలో శుద్ధికొండ త్రినాధ స్వామి యాత్ర ప్రతి ఏటా కనుమ నాడు జరుగుతుంది. అదేరోజు హనుమాన్ రథయాత్ర కూడా చేస్తారు. ఇక్కడ పెద్ద జగన్నాథ దేవాలయం ఉన్నది. దేవాలయం వద్ద జరిగే పండుగలను వీక్షించటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

పీర్ల కొండ

పీర్ల కొండ హిందూ. ముస్లిం ల మతసామరస్యానికి ప్రతీక. పూర్వం నవాబుల పరిపాలనలో ఇక్కడ పీర్ల కొండ పై ఉన్న కట్టడాలను ప్రార్థనా మందిరాలుగా ఉపయోగించేవారు. క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందినవైనా ఇవి నేటికీ చెక్కుచెదరలేదు. ప్రతిఏటా మార్గశిర గురువారాలలో హిందువులు ఈ మందిరాల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. హైందవ సంప్రదాయం ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా - ఒరిస్సా ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో ఈ ఉత్సవాలను తిలకించటానికి వస్తుంటారు.

ఇతర ఆకర్షణలు

నర్మదేశ్వర స్వామి ఆలయం, శివాలయం మరియు దుర్గాదేవి గుడుల సముదాయం, మసీద్.

సమస్యలు

  • సరిహద్దు మండలం కావడం వల్ల చిన్న చూపు
  • రైల్వే పరంగా ఇబ్బందులు పరిష్కరించాలి
  • ఖుర్ధా డివిజన్ లో ఉండటం వల్ల ఒడిషా పెత్తనం అధికం
  • వాల్తేర్ డివిజన్ లో విలీనం చేయాలి
  • రెండు పిఐటి లైన్స్ కావాలి
  • హౌరా - యశ్వంత్-పూర్, పూరి -అహ్మదాబాద్, విశాఖ - అమృతసర్(హిరాకుడ్)
  • వాస్కోడిగామా - పూరి ఓకా, పూరి - చెన్నై, షాలిమార్ - విశాఖ, పూరి - గాంధీగ్రాం
  • కెజిపి - విఎం రైళ్లు ఇక్కడ నిలపాలి
  • ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం కల్పించాలి
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి