ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పురపాలక స్థాయికి ఎదిగినా మౌలిక సౌకర్యాలు కూడా లేని ఎలమంచిలి వాసుల కస్టాలు వీనేదెవరు? తీర్చేదెవరు?

విశాఖపట్నం జిల్లా లో ఎలమంచిలి మున్సిపాలిటీ క్రీస్తు శకం 7 వ శతాబ్దం నుండే చారిత్రక ప్రసిద్ధి పొందిన ప్రాంతం గా గుర్తింపు పొందింది. జిల్లా కేంద్రానికి ఇది 94 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలమంచిలి మునిసిపల్ పట్టణ జనాభా 27295. వీరిలో మగవారు 13,395 మంది కాగా, మహిళల సంఖ్య 13,395. ఈ ప్రాంతం ప్రతి 1000 మంది పురుషులకు1040 మంది మహిళలతో , లింగ నిష్పత్తి లో రాష్ట్ర తలసరికంటే మెరుగ్గా ఉంది. ఈ ప్రాంతంలో అక్షరాస్యుల సంఖ్య కూడా ఎక్కువే. 77.14 శాతం అక్షరాస్యతతో, ఈ పట్నం రాష్ట్ర తలసరి అక్షరాస్యత శాతం (67.02%) కంటే ఎక్కువే.

ఎలమంచిలి పట్టణం వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో వెనుకబడిఉందనే చెప్పవచ్చు. ఈ పట్టణ ప్రజలు ఇంకా వ్యవసాయ ప్రధానమైన వృత్తులలోనే జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తరువాత మత్స్యకారుల కుటుంబాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే ఇక్కడి రహదారులు జలమయమై, ఇండ్లలోకి నీళ్లు చేరుతుంటాయి. సంవత్సరాలుగా మురుగు కాలువలలో మేటవేసిన వ్యర్థాలు తొలగించక పోవడంవలన మురుగు రోడ్లపై ప్రవహిస్తూ, వర్షాకాలం లో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తాయి. రహదారులు, వైద్యం, విద్య, త్రాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, పారిశ్రామిక అభివృద్ధి ఇక్కడి తక్షణ అవసరాలు.

పట్టణా జీవనాన్ని ప్రతిబింబించే ప్రాధమిక వసతులు ఇక్కడ లేనప్పటికి, ఎలమంచిలిని పురపాలక సంఘం స్థాయికి పెంచడం వల్ల ఇక్కడ పనులు మాత్రం విపరీతంగా పెరిగాయి. ప్రాథమిక సౌకర్యాలు లేనప్పడికి ప్రజలు అధిక పన్నుభారాన్ని మోయాల్సివస్తుంది. పంచాయతీ స్థాయి నుండి మున్సిపాలిటీ స్థాయికి పెరగడం వల్ల, కేంద్ర ప్రభుత్వం అందించే ఉఫాధి హామీ పథకం తాలూకు నిధులు కూడా ఇప్పుడు వర్తించవు. 70 శాతం పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో సాగునీటికి తీవ్రమైన కొరత ఉంది. సహజ సిద్దం గా ఏర్పడిన లేదా ప్రభుత్వం నిర్మించిన నీటి రిజర్వాయర్లు వర్షపు నీటి పైన ఆధారపడుతున్నందు వలన వర్షాకాలం రాకముందే ఈ మున్సిపాలిటీ పరిధిలో గల శేషుగెడ్డ , ఎడ్లగెడ్డ నీటి రిజర్వాయిర్లకు తనికీలు, మరమత్తులు పూర్తి చేసుకుంటే, కనీసం వర్షపు నీటినైనా నిల్వ చేసుకోవచ్చు. జాతీయ ప్రాజెక్ట్ ఐన పోలవరంపై నిర్మిస్తున్న ఆనకట్ట పూర్తయితే, ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు, అందుతుంది. దేశ భవిష్యత్ అవసరాలను దీటుగా ఎదుర్కొనేందుకై ఎలమంచిలి లొ నావికా దళం నిర్మించ తలపెట్టిన కొత్త నౌకాశ్రయ నిర్మాణం కొరకు ఈప్రాంతంలో భూమిని సేకరించారు. ఫలితంగా ఇక్కడి గ్రామస్తులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు. భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం కానీ, పునరావాసం కానీ అందలేదు. ఉద్యోగావకాశాలు, గృహాలు, మత్స్యకారుల కుటుంబాల కొరకు ఉద్యోగావకాశాలు ,పాఠశాల, ఆసుపత్రి, ప్రత్యేకమైన చేపల జె ట్టీతో సహా ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ ఇప్పడివరకు నెరవేరలేదు. మత్స్యకారులకు 55 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మంజూరై , ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైనప్పటి, వారికి ఇంకా పింఛను అందడంలేదు.

తీర ప్రాంతం కాబట్టి, ఇక్కడి భూగర్భ జలాలు సైతం ఉప్పగా ఉండటం తో ఇక్కడ త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, తాగునీటి సరఫరా తక్షణమే తీర్చవసిన సమస్య. దీనితోబాటు, పెరిగిన యువత విద్యా, ఉఫాధి అవసరాలను తీర్చాలంటే సత్వరమే సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అందించే ఐఐటీ ఇంకా పాలిటెక్నీక్ కళాశాలలు ఏర్పరచాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ ఇక్కడి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లేక ఈ ప్రాంతపు యువత వలస దారి పట్టారు. దీనిని నివారించడానికి వృత్తి ఉద్యోగాలు పెంపొందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నందున 'పంచదార్ల బౌద్ధారామాలు ఇంకా రాంబిల్లి తీరాలను పర్యాటక ప్రాంతాలుగా వృద్ధి చేసి, స్థానికులకు అందులో ఉఫాధి అవకాశాలు కల్పించాలి.

ఎలమంచిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి