ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పాయకరావుపేట ప్రజల కష్టాలు ఇంతింత కాదయా, విశ్వదాభిరామా, వినురవేమా!

జిల్లా కేంద్రం విశాఖపట్టణానికి పశ్చిమాన, 95 కిలోమీటర్ల దూరంలో ఉంది పాయకరావుపేట పట్టణం. ఇది మండల కేంద్రం మాత్రమే కాదు, విశాఖాజిల్లాలో గల 15 శాసనసభా నియోజక వర్గాల్లో ఒకటి. షెడ్యూలు తెగలకై రిజర్వు చేయబడిన ఈ నియోజకవర్గంలో 94544 మంది ఓటర్లుండగా, 2011 జనాభా లేఖ్కల ప్రకారం మండల జనాభా 93093. 2018 నాటికి ఈ సంఖ్య 102403కి చేరుకుంటుందని అంచనా. వీరిలో 52452 మంది అక్ష్రరాస్యులుండగా, మహిళలకంటే , మగవారీ లో అక్షరాస్యత ఎక్కువగాఉంది. వివిధ వృత్తుల ననుసరించి జీవనం సాగిస్తున్న ఇక్కడి ప్రజలలో అధికశాతం వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్నారు. జనాభాలో 37172 మందికి మాత్రమే వ్యాపార, ఉద్యోగ అవకాశాలున్నాయి. మగవారిలో దాదాపు 65% మంది ఆర్జనపరులైతే, కేవలం 15% మహిళలకే ఆదాయ వనరులున్నాయి. వ్యవసాయంలో కూడా మహిళల సంఖ్య చాలా తక్కువ. 2524 మంది రైతులున్న పాయకరావుపేటలో 13, 245 మంది రైతు కూలీలున్నారు అంటే, అధికశాతం జనాభా దినసరి కూలీల మీదనే ఆధారపడుతున్నారు. పాయకరావుపేట తూర్పు గోదావరి జిల్లాకు అతిచేరువలో ఉంది. సముద్ర మట్టానికి 42 మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికి, బంగాళా ఖాతానికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడిగాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటూ, తీర ప్రాంత వాతావరణాన్ని పోలిఉంటుంది. మండల కేంద్రమైన పాయకరావుపేట పట్టణంలో 27001 మంది జనాభా ఉంటే, వారిలో మగవారి సంఖ్య 13,252 ఐతే, మహిళల సంఖ్య 13, 749. పట్టణ జనాభాలో 76.81 శాతం ప్రజలు అక్షరాస్యులు.

రైతులకు, సామాన్య ప్రజానీకానికి సాగు, తాగునీటి సరఫరా లేకపోవడమే ప్రధాన సమస్య. ఈ మండలంలో తాండవ నది ప్రవహిస్తున్నా, ఇక్కడి ప్రజానీకానికి సాగు, తాగు నీటి సరఫరా సక్రమంగా లేదు . తాండవ నది విశాఖ జిల్లాలోని చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలితోబాటుగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని తుని మీదుగా, 99 కిలోమీటర్ల మేరకు ప్రవహిస్తుంది. కానీ, మొదటి 14 కిలోమీటర్లవరకు ఉదృతంగా ఉన్న నది, క్రమంగా బలహీనమౌతూ, 1000 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ నీటి ప్రవాహాన్ని చేరవేస్తుంది. దారిలో ఈ నదికి అనేక చిన్న ఉపనదులైన సాపేగెడ్డ కాలువ, పెద్దగెడ్డలంక, దారగెడ్డ, చట్టంపాడుగెడ్డ, గొర్రిగెడ్డ, అద్దకాలగెడ్డ, సరుగుడుగెడ్డ వంటివి మరో 11 కిలోమీటర్ల దూరంవరకు కలిస్తే, 6502 క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. దీని తరువాత, దిగువన ఉపనదులు లేక పోవడంతో ప్రవాహం చాలా సన్నబడుతుంది. భూగర్భజలాలు కూడా అడుగంటిపోయి, బోరుబావులలో ఉప్పునీళ్ళే వస్తుండటంతో, నీటిసమస్య తీవ్రంగా ఉంది. వర్షపు నీటిని దైనందిన అవసరాలకి ఇంటిపైకప్పులలో ట్యాంకులకు నిర్మించి దాచుకోవడం మార్గంగా నీటిపారుదల నిపుణులు వీరికి సలహాలిస్తున్నారు. వరహానదికి మరమ్మత్తులు చేసి,  గ్రోయిన్లను అమరిస్తే కొంతవరకు తాగునీటి కష్టాలు తొలగించవచ్చు.

నక్కపల్లి మండలం, యస్. రాయవరం గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. పలు పర్యాటక, ఆధ్యాత్మిక, సాహితీ పరమైన ప్రఖ్యాతి పొందిన ప్రదేశాలున్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రధానసమస్యలు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇంకా మౌలికవసతుల లేమి. ఆధునిక తెలుగుభాషా వైతాళికుడు శ్రీ. గురజాడ అప్పారావు పుట్టిన ఈ గడ్డలో నాణ్యమైన ప్రాధమిక విద్య బోధించే పాఠశాలలకు కరువైతే, హై స్కూళ్ళు , జూనియర్ కాలేజీలు, వృత్తి విద్యా భోధన సంస్థలు లేవు. డిగ్రీ కళాశాలలు నెలకొల్పి సైన్సు గ్రూఫు కోర్సులు ఉండేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల పరిస్థితిని మెరుగు పరచి, వృత్తి విద్యనందించే ఐఐటీ లను స్థాపించాలి. ప్రస్తుతం ఉన్న 35 పడకల ఆసుపత్రిని ఆధునీకరించి, 50 పడకలకు పెంచడంతోబాటు, కీళ్ల వ్యాధులు, గర్భిణీ స్త్రీలకూ కావలసిన వైద్య సదుపాయాలూ కల్పించాలి. పర్యాటకంగా వృద్ధి చెందుతున్న ఉపమాక, గురజాడ అప్పారావు జన్మించిన యస్ రాయవరం వంటి ప్రదశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తే, పర్యాటకుల సంఖ్య పెరిగి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కాలుష్య కారకమైన పెట్రో రసాయన ఫ్యాక్టరీలనుండి ప్రజలకు తగు రక్షణ కల్పించాలి. మూతపడిన చక్కర కర్మాగారాలను పునరుద్ధరించి, ఈ ప్రాంతంలో వెళ్లునుకొని ఉన్న కొబ్బరి, జీడీ, మామడిపండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులనుండి ఆహారపదార్ధాల తయారీ కేంద్రాల స్థాపన జరిగితే, ఇక్కడి ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తారు.

పాయకరావుపేట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి