ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పర్యాటక, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనతో బాటు మౌలికవసతుల అభివృద్ధితో శ్రీకాకుళంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు

ఉత్తరాంధ్ర, కలింగాంధ్ర, మరియు గుల్షానాబాద్ అని పిలువబడే శ్రీకాకుళానికి 800 ఏళ్లకుపైబడిన చరిత్ర ఉంది. ప్రస్తుతం గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా చలామణీ అవుతున్న శ్రీకాకుళం పురపాలక సంఘాన్ని 1856 లో స్థాపించారు. సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పట్టణ పాలనా బాధ్యతలను ఎందరో స్వాతంత్ర సమరయోధులు, మేధాసంపన్నులు నిర్వహించారు. వంశధారా మరియు బంగాళాఖాతం ఒడ్డునే ఉన్న శ్రీకాకుళం పట్టణం మీదుగా నాగావళి నది ప్రవహిస్తూ, తరాలుగా ఈ ప్రాంతపు మంచినీటి అవసరాలను తీరుస్తున్నది. శ్రీకాకుళం మండల జనాభా 2,20,332. వీరిలో 66% మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తుంటే, 34% ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఆధునిక శ్రీకాకుళం జిల్లా ఆగష్టు 15, 1950లో ఏర్పడింది. శ్రీకాకుళం పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా, అసెంబ్లీ నియోజకవర్గంగా వ్యవహరిస్తున్నది. చేనేత  ఇక్కడ ప్రధాన కుటీర పరిశ్రమ. శ్రీకాకుళం మస్లిన్ నాణ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది. 2000 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఓడరేవు ఉంది. ఈ ప్రాంతాన్ని కళింగనగరిగా పిలిచేవారు. సహజ ఓడరేవు అయిన కళింగపట్నం రేవులో చక్కని వాతావరణం, మెరుగైన సౌకర్యాలు ఉండేవి. స్వతంత్య్రానికి పూర్వమే ఈ రేవు నుండి దేశ విదేశాలకు ఎగుమతి, దిగుమతులు నిర్వహించడంతో, ఈ రేవు స్థానికులకు ఉఫాధి అవకాశాలు కల్పించడంతో బాటు, ప్రభుత్వానికి వేదేశీమారక ద్రవ్యం కూడా సమకూర్చేది. అటువంటి కళింగపట్నంరేవు ప్రస్తుతం దీనావస్థలో ఉంది.

2,33,273 మంది ఓటర్లున్న శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం మున్సిపాలిటీతో బాటు గార మండలం కూడా ఉంది. 150 సంవత్సారాలు పైబడ్డ పురపాలక సంస్థతోబాటు, 60 ఏళ్లకు పైబడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రి, దంతవైద్యకళాశాల, అతిపెద్ద వ్యవసాయ పరి శోధనా కేంద్రం, మరియు వ్యవసాయ కళాశాలలు ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు. జిల్లా కేంద్రం కావడంతో చుట్టుపక్కల గ్రామాలనుండి ప్రజల వలసలు అధికంగా ఉంటుంది.

శ్రీకాకుళం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలూ కరవైనాయి. ముఖ్యంగా రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీళ్లు, సాగు నీరు కొరకు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. పట్టణంలోని కిల్లి పాలెంలో తాగునీటికోసం నీటి ట్యాంకు నిర్మాణం పూర్తై, ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభమైనా, నీళ్లు మాత్రం సరఫరా కావడం లేదు. పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, అరసవెల్లి మాస్టర్ ప్లాన్ వంటివి మొదలు కాలేదు. కోడి రామమూర్తి స్టేడియం ఆధునీకరణ పనులు తవ్వకంతో మొదలుపెట్టి ఆగిపాయింది కానీ పురోగతి లేదు. దీనివలన ఇంతకుముందున్న స్టేడియం కూడా అందుబాటులో లేదు. నాగావళి వంశధార నదులలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలను కొత్త ఇసుక విధానం ఏమాత్రం అరికట్టలేకపోతున్నది. ఇసుక తవ్వకాలు శాస్త్రీయ పద్ధతుల్లో జరగకపోవడం వల్ల నదీ ప్రవాహానికి, పర్యావరణానికి తీరని హానిజరగడంతో బాటు, భూగర్భజలాలు ఎండి పోతాయి. మునిసిపల్ కార్పొరేషన్ స్థాయికి చేరినా ఆస్థాయి అభివృద్ధి లేదు. గ్రామీణ ప్రాంతాల రక్షిత మంచినీటి సరఫరా, గార మండలంలో ఎత్తిపోతల పధకం, బైరీసిగెడ్డ కాలువపనులు పూర్తయితే తాగు, సాగునీరు అందుతుంది. అరసవల్లి , శ్రీకూర్మము, శాలిహుండం, శ్రీముఖలింగం వంటి పుణ్యక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉద్యాన పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి

శ్రీకాకుళం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి