ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

శృంగవరపు కోటకు ఏర్పడిన పగుళ్ళకు మరమ్మతు చేసేదెలా?

శ్రుంగవరపుకోట విశాఖపట్నం నగరానికి వాయువ్యంగా, విశాఖ విమానాశ్రయానికి 46 కిలోమీటర్ల దూరంలో వుంది. శృంగవరపుకోట సముద్ర మట్టానికి 70 మీటర్లు (232 అడుగులు) ఎత్తులో , జిల్లా కేంద్రం విజయనగరానికి కేవలం 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ పట్టణం మండల కేంద్రంగానే కాకుండా , అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా వ్యవహరిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం, శ్రుంగవరపుకోట పట్టణ జనాభా 28304. ఇందులో 13867 పురుషులు, 14437 మంది స్త్రీలు ఉన్నారు. 2011 లో మొత్తం 19,622 కుటుంబాలు శ్రుంగవరపుకోట మండలంలో నివసిస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతం కంటే, పట్టణ ప్రాంతంలో అధిక జనాభా ఉంది. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత 64.5 శాతం

యస్ కోట అని ప్రముఖంగా పిలువబడే శృంగవరపుకోట జిల్లా కేంద్రం విజయనగరంలోని పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉండటంతో, దీనిని నగర శివారు పట్టణంగా పరిగణిస్తారు. ఎక్కువమంది ప్రజలు స్వంత భూములు లేక పరిశ్రమలలో నిత్య కూలీలుగా పనిచేస్తూ, పేదరికం అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో తగినన్ని ఉఫాధి అవకాశాలు లేకపోవడంతో, తక్కువ ఆదాయాన్నిచ్చే పనులతో వారు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పట్టణంలో తాగు, సాగు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో రైవాడ నది నీరు వేపాడ మీదుగా కాలువ ద్వారా ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతం భూములకు సాగు నీరు అందటం లేదు. చింతలగెడ్డ, తాడిపూడి జలాశయాలు పూర్తయితే వీరికి తాగు, సాగు నీళ్లు అందుతాయి. ఇక్కడ రహదారులు అధ్వాన్న పరిస్థితిలో ఉండటంతో బాటు,  రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లేదు. ఈ ప్రాంతం నుండి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చేరడానికి తగిననన్ని ఆర్. ట్. సి బస్సు సర్వీసులు లేవు. ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యం గల ప్రాంతమైన పుణ్యగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసి, అరకు, విషయాకా నగరాలతో అనుసంధానిస్తే, ఈ ప్రాంతంలో ఉఫాధి అవకాశాలు పెరుగుతాయి

శ్రుంగవరపుకోట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి