ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అందాల భీమిలి అభివృద్ధి చెందిన జాబిలిగా మారుతుందా?

భీమిలీగా ప్రసిద్ధి పొందిన ‘భీముని పట్నం భారతదేశం లోని రెండవ అతి ప్రాచీనమయిన పురపాలక పట్టణం. ఫిబ్రవరి 8, 1861 లోనే పురపాలికగా ఏర్పడిన ‘భీమిలి’ పట్టణ జనాభా అప్పట్లో 5,219. దీనికి విరుద్ధంగా, ఆ సమయంలో విశాఖపట్టణ జనాభా కేవలం 4,600 మాత్రమే. విశాఖపట్నానికి కేవలం 24 కిలోమీటర్ల దూరం లో ఉన్న భీమిలి ఒక ప్రసిద్ధ చారిత్రక, పర్యాటక ప్రదేశం. వెండి వెన్నెలను తలపించే సుందరమయిన సముద్ర తీరాలు, బౌద్ధ, హిందూ మతాలకు చెందిన ప్రాచీన చారిత్రిక శిలాసంపద, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు తీరం వెంట ఉన్న కొండలపై, 1850 లో డచ్ నిర్మించిన క్లాక్ టవర్ మరియు 1864 లో నిర్మించబడిన St. పీటర్స్ చర్చి భీమిలి స్వంతం. భీమిలి నియోజకవర్గం లో మొత్తంగా నాలుగు మండలాలు ఉన్నాయి. అవి ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం ఇంకా విశాఖపట్నం రూరల్. మహాభారత కథలో పాండవులలో రెండవ వాడయిన భీముని పేరిట ఈ పట్నం వెలిసిందని స్థలపురాణం చెబుతోంది.

భారతదేశ గజటీర్ ప్రకారం భీముని పట్నం తహశీల్ 117 గ్రామాలతో, 207 చదరపు మైళ్ళు (540 కిలోమీటర్లు) విస్తీర్ణం కలిగి ఉంది. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం భీమునిపట్నం జనాభా 116,349. వీరిలో పురుషుల సంఖ్య 57,408 (49%), మహిళల సంఖ్య 58,941(51%)గా నమోదైంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 67% గా ఉంటే, మహిళల అక్షరాస్యత 54%. దీనిని బట్టి చూస్తే ఇక్కడి ప్రజలను విద్యాధికులుగా, చైతన్యవంతులుగా పేర్కొనవచ్చు.

అపారమైన వనరులు ఉన్నప్పటికి ఈ మునిసిపాలిటి పరిధిలో సమస్యలకు సవాళ్లకు కొదవలేదు. పర్యాటకాభివృద్దికి అనువైన మౌలిక వసతులు ఇంకా ఇక్కడ పూర్తీ స్తాయి లో అభివృద్ధిచెందలేదు. అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను అలవోకగా ఆకర్షించే అవకాశం ఉన్న భీమిలి ముందుగా పారిశ్శుద్ద్యం, నీటికొరత ఇంకా భూగర్భ డ్రైనేజీ వంటి ప్రాథమిక వసతుల కల్పనలో వెనుకబడి ఉంది. విశాఖపట్నం నుండి భీమిలికి వెళ్ళే 24 కిలోమీటర్ల, బీచ్ కి అనుకుని వెళ్లే అతిసుందరమైన రహదారిలో ప్రయాణం అందమైన అనుభూతిని కల్పిస్తుంది. కాని, వీటికి సమీపంలోని మురికివాడలు, పేదరికం, అభివృద్ధి నిరోధకంగా కనిపిస్తుంది. పేదరిక నిర్ములన జరగాలంటే స్థానిక యువతీ, యువకులకు విద్య, మరియు ఉఫాధి అవకాశాలు పెరగాలి. కళాశాల మరియు ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి కూడా వృత్తి సంబంధిత నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. దీనికై నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఉపయోగించాలి. మత్స్య మరియు పర్యాటక పరిశ్రమలలో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ మరియు, చేపలు, రొయ్యల ఎగుమతి-దిగుమతి రంగాలలో 10 లేదా ఇంటర్ వరకు చదివిన వారికి కుడా అవకాశాలు కల్పించవచ్చు. కానీ వీరికి తగిన శిక్షణ అందించాలి. స్థానిక మత్స్యకారులు కుటుంబాల అభివృద్ధికి తగిన ప్రణాళిక అవసరం. ముఖ్యంగా సముద్రాల్లో చేపలు పట్టేందుకు వెళ్లేవారు అనేక ప్రమాదాలకు లోనౌతారు. సముద్ర తీరం వెంబడి ఎదురయ్యే అనేక ప్రక్రుత్తి విపత్తులు వీరు ఎదుర్కొంటారు. ఆధునిక శిక్షణ, మత్స్య సంపద అభివృద్ధి కై తగిన ప్రాసెసింగ్ యూనిట్లు, మరియు తగిన ప్రమాద భీమా కల్పించాలి. ప్రమాదాలలో గాయపడి, లేదా మరణించినవారికి ఇది ఉపయోగపడుతుంది.భీమిలి బీచ్ తో సహా, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకై ఒక అథారిటీని ఏర్పాటు చేసి, వీటి భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ కార్యక్రమం కింద బౌద్ధ వలయం అభివృద్ధికి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా ఎంపిక చేసింది. ఇందుకోసం రూ.5.233 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాని, ఈ పథకానికి అమరావతి, అనుపు, బొజ్జన్నకొండ, శాలిహుండం, తొట్లకొండ మరియు బావికొండలను మాత్రమే ఎంపిక చేశారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో ప్రధానంగా అంతర్గత రోడ్లు, కాలిబాటలు, ధ్యానమందిరాలు, టాయ్లెట్స్, పచ్చదనం, టూరిజం హోటళ్లు వంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకొంటారు. ఇటువంటి చర్యలు భీమిలి ప్రాంతానికి కూడా అవసరం. దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు ఇది తోడ్పడంతో బాటు, స్థానికులకు అపారమైన ఉఫాధి అవకాశాలు కల్పిస్తాయి.

సముద్ర వాణిజ్యం అబ్జివృద్ది చెందిన ఈ రాష్ట్రం లో తగిన ఆదాయవనరులను పెంచేందులు భీమిలి లో ఒక ఓడరేవు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. రేవులకు అనుసంధానంగా అభివృద్ధిచెందిన, ముంబై, చెన్నై ఇంకా వైజాగ్ నగరాలే దీనికి ఉదాహరణలు. గత కొంత కాలంగా మూతబడిన చిట్టివలస జూట్ మిల్ పునరుద్ధరించి, దానిలో స్థానిక కార్మికులకు ఉఫాధి అవకాశాలుకల్పించాలి.

భీమిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి