ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాజాం గ్రామీణ ప్రాంతాల ప్రజలు కనీస అవసరాల కోసం ఉద్యమం చేయాల్సి వస్తే ఇంత కంటే దురదృష్టం ఏముంటుంది?

రాజాం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం, 51842 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 26048 మంది పురుషులు, 25794 మంది మహిళలు ఉన్నారు. రాజాం ప్రాంతం అక్షరాస్యత శాతం 45% మాత్రమే. రాజాం ప్రాంతం ఉపాధి పొందిన వారి సంఖ్య 27056, నిరుద్యొగుల సంఖ్య 24786,. వీరిలో అధికశాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రాజాం నియోజకవర్గంలో వంగర, రేగిడి ఆమదలవలస, రాజాం, సంతకవిటి మండలాలు ఉన్నాయి.

రాజాం నియోజక వర్గంలో 2,00,781 మంది ఓటర్లున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి దాదాపు 13 మండలాల ప్రజలకు రాజాం పట్టణమే ప్రధాన కేంద్రం. కాబట్టి ఈ రెండు జిల్లాల ప్రజలు అనేక అవసరాల నిమిత్తం రాజాం వస్తుండటంతో ప్రధాన వీధులన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దశాబ్దాలుగా రాజాం రహదారులు మర్మత్తులకు, విస్తరణకు నోచుకోలేదు. ఫలితంగా ప్రధాన వీధులన్నీ వాహనాలతో నిండిపోయి, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించటమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తుంది. గ్రామీణ ప్రాంతంలో విరివిగా పండే కూరగాయలు, పండ్లను రైతులు రాజాం మార్కెట్లో విక్రయానికి తెస్తుంటారు. సరైన రైతుబజార్ సదుపాయాలు లేక ఇక్కడి రైతులు రోడ్డుపైనే అమ్మవలసి వస్తుండటంతో వీధులు మరింత రద్దీగా తయారయ్యి, స్థానికులకు అసౌకర్యం కలిగిస్తున్నది. ఎర్రచెరువు విస్తరణ, బలసాల రేవులో నాగావళి నది మీదుగా వంతెన నిర్మించాలని రాజాం వాసులు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. ఈ నదికి వరదలొచ్చినప్పుడల్లా నదినిదాటలేక ప్రజలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోతాయి.

ఇక తోటపల్లి, నారాయణపురం రిజర్వాయర్లు నుండి సాగునీరందించే ఎత్తిపోతల పధకం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. మద్దివలస రిజర్వాయర్ను అభివృద్ధిచేసి, స్థానిక పౌరులకు ఉఫాధి అవకాశాలు పెంచవచ్చు. మౌలిక సదుపాయాల కల్పనతోబాటు, విద్య, వైద్యం ఉఫాధి అవసరం ఉంది.

రాజాం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి