ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గూడెం కొత్తవీధి మండలం

గూడెం కొత్తవీధి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 120 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 58,542 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 27,869, ఆడవారి సంఖ్య 30,673. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 32.39% ఇందులో పురుషులు 42.54% మంది మరియు స్త్రీలు 22.36%

ప్రధాన పంటలు

వరి

ఈ పట్టణ సమస్యలు

  • శ్రీ దారాలమ్మ ఆలయానికి నీరు కరవు. పారిశుధ్య సమస్య ఉంది. మరుగుదొడ్లు లేవు
  • విష జ్వరాలతో జనం మృత్యువాత పడుతున్నారు.
  • అటవీ ఉత్పత్తులు అన్నీ జి.సి.సి కొనుగోలు చేయాలి
  • అటవీ ఉత్పత్తులకు అనువైన కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి
  • ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి
  • విత్తనాలు, ఆహార పదార్ధాలలో నకిలీలు, కల్తీలు అరికట్టాలి
  • గుమ్మలగాంధీ చెక్ డ్యామ్ కోసం ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేదు. ఈ డ్యామ్ నిర్మిస్తే 700 ఎకరాలకు నీరు అందుతుంది
  • ఇంటర్నెట్ సౌకర్యం లేదు
  • చాలా గ్రామాలకు రోడ్లు లేవు
  • రవాణా వ్యవస్థ అధ్వాన్నం
  • చావరాతిపాలెంలో లేట్రైట్ ఖనిజ్ తవ్వడం వల్ల నాలుగు గ్రామాలలో ఊటలు ఎండిపోతున్నాయి
  • కాఫీ తోటలు ఉత్పత్తి తగ్గింది
  • చింతాడ, పెదవలస మీదుగా కె.జి.పేట వెళ్లే 47 కి.మీ. రహదారి దారుణంగా ఉంది
  • రహదారి ధ్వంసమయ్యింది
  • నీలవరం, కొత్తపల్లి, కుంకుమపూడి, చెరకుపాకంలలో చెక్ డ్యామ్ లు కట్టాలి
  • బస్ సౌకర్యం కల్పించాలి
  • కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలి
  • కొండ నీరు ఊటగెడ్డలో కలవటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు
  • నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి