ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కాలుష్యం బారినుండి సైబీరియాన్ పక్షులకే కాక స్థానిక టెక్కలి వాసుల ఆహారభద్రతకు కలిగే పెనుముప్పును తప్పించడమెలా?

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఉత్తర దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి మండల కేంద్రం, డివిజన్ కేంద్రం మరియు శాసనసభ నియోజకవర్గం. సముద్రమట్టానికి 27 మీటర్ల ఎత్తులో ఉన్న టెక్కలి 1901 వరకు జమీందారీ తహశీల్ పరిధిలో ఉండేది. మేజర్ పంచాయతీ స్థాయి నుండి ప్రస్తుతం 40 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీ హోదాను సంతరించుకుంది టెక్కలి.

శ్రీకాకుళం నుండి 65 కిలోమీటర్లదూరంలో ఉన్న తేలినీలపురం గ్రామం టెక్కలి మండలంలో ఉండగా, జిల్లా కేంద్రం నుండి 115 కిలోమీటర్ల దూరంలో, ఇచ్ఛాపురం మండలంలో తేలుకుంచి గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాలు సైబీరియాన్ వలసపక్షులకు ఆతిధ్యం ఇస్తాయి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో చెట్ల మీద పక్షులు వాటి పిల్లలకు ఆహరం అందించే ప్రక్రియను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అమితంగా ఆసక్తి చూపుతారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో 3,000 కి పైగా పెలికాన్ మరియు పెయింటెడ్ కొంగలు సైబీరియా నుండి ఈ గ్రామాలకు వలస వచ్చి, మార్చివరకు ఇక్కడే ఉంటాయి. 15 సంవత్సరాలనుండి సాగుతున్న ఈ ప్రక్రియలో మొదట్లో 10 వేలకు పైగా పక్షులు వచ్చేవి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 3000కు పడిపోయింది. దీనికి కారణం పనికి ఆహార పధకం కింద విచక్షణా రహితంగా చెరువులను తవ్వేయడమే. దీనివల్ల చెరువులు అంతరించి, పక్షుల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడటం వల్ల వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. ఇదేకాకుండా థర్మల్ పవర్ ప్లాంట్ కాలుష్యం కూడా పక్షుల సంఖ్యను తగ్గించాయి. మదనగోపాలసాగరం పూడికతీస్తే సాగు సమస్య తీర్చవచ్చు. భావనపాడు హార్బర్ నిర్మాణం దశాబ్దాలుగా పూర్తి కాలేదు. పోర్టుల వలన కాలుష్యానికి మత్స్య సంపద కూడా అంతరిస్తున్నది. కాలుష్యం ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించకముందే తగిన చర్యలు అవసరం.

టెక్కలి మండలంలో ప్రధాన సమస్యలు సాగు, తాగు నీరు ఇదేకాకుండా ఈ ప్రాంతంలో రహదారులు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో రవాణా సౌకర్యాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. రైతులకు నకిలీ విత్తనాల బెడదతో పాటు తగినన్ని ప్రోత్సాహకాలు లేవు. ఫలితంగా, క్రమంగా వ్యవసాయం అంతరించి పోతుంది. తగినన్ని ఉఫాధి అవకాశాలు, కరువైన ఈ వెనుకబడిన మండలాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

టెక్కలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి