ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అచ్యుతాపురం మండలం

అచ్యుతాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండల కేంద్రం విశాఖపట్టణం రైల్వే స్టేషను నుండి 52 కి.మీ అనగా 32 మైళ్ళ దూరంలో ఉండును. అక్షాంశం 17.4 మరియు రేఖాంశం 78.48 అచ్చుతాపురం యొక్క భౌగోళిక అక్షాంశాలు.

అచ్చుతాపురం మండలం చుట్టుపక్కల అనగా దక్షిణాన మునగపాక మండలము, తూర్పున పరవాడ మండలము, పశ్చిమాన రాంబిలి మండలము, ఉత్తరాన కశింకోట మండలము సరిహద్దులలో ఉన్నాయి.

అచ్చుతాపురం మండలములోని మొత్తం జనాభా 58,899, 13,491 ఇళ్ళు, 67 గ్రామాలు మరియు 27 పంచాయతీలలో విస్తరించింది. పురుషుల సంఖ్య 29,621, స్త్రీలు 29,278. గంగమాంబపుర అగ్రహారం అతిచిన్న గ్రామం మరియు పూడిమడక అతిపెద్ద గ్రామం.

ఈ పట్టణ సమస్యలు

ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్) కర్మాగారాల నుంచి వెలువడుతున్న వ్యర్ధాలు సమీప సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. దీనితో పూడిమడక మత్స్యకార తీరం మొత్తం కలుషితమైపోయింది. ఈ కారణంగా సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. ఉపాధి లేక మత్స్యకారులు విలవిలలాడిపోతున్నారు. సెజ్ల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలి. సెజ్ లు వస్తే 60 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు తరువాత ముఖం చాటేశాయి. ఇప్పటి వరకు కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగాయి. మిగిలిన ఉద్యోగాల గురించి యాజమాన్యాలు, సర్కార్ మాట్లాడటం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన ఉద్యోగాలు ఇవ్వాలి

ఎలమంచిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి