ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సాలూరు మల్లెపూల సువాసనలను ఆస్వాదించాలంటే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి, సమస్యలను తరిమికొట్టాలి!

వంశధార ఉపనదైన వేగావతి ఒడ్డున గల సాలూరు విజయనగరం జిల్లాలో ఒక మండల కేంద్రం మరియు వెనుకబడిన తెగలకు రిజర్వ్ చేసిన అసెంబ్లీ నియోజకవర్గం. కొండల మద్యలో అమరిన అందమైన సాలూరు, రాష్ట్రంలోనే అతి సుందరమైన ప్రదేశాలలో ఒకటి. సాలూరుకి సమీపంలో పర్యాటకంగా ప్రసిద్ధి పొందిన శంబరపోలమాంబ, పారమ్మకొండ ఉన్నాయి. తోణం వాటర్ ఫాల్స్, దండిగం, కూరుకుటి వాటర్ ఫాల్స్, పాచిపెంట డ్యాం, శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు.

రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు ప్రధానంగా లారి పరిశ్రమపై ఎక్కువగా ఆదారపడి ఉన్నారు. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి. ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన అరకు వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి.

ఒరిస్సా, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను దక్షిణాది రాష్ట్రాలతో సాలూరు అనుసంధానిస్తుంది కాబట్టి, ఈ మూడు రాష్ట్రాలకు సాలూరు వాణిజ్య కేంద్రంగా కొనసాగుతుంది. 100 సంవత్సరాల పూర్వం ఫిలడెల్ఫియా కమ్యూనిటీ హాసిపిటల్ వారు స్థాపించిన టి, ఎల్. ఎం కుష్టువ్యాధినివారణా కేంద్రం కారణంగా సాలూర్ బాగా ప్రసిద్ది చెందినది 1906 లో సాలూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెజిరామ్ గ్రామంలో ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. ఆ సమయంలో అత్యంత విప్లవాత్మక సంస్థలలో ఇది ఒకటి మరియు వ్యాధి తీవ్రతతో బాధపడుతున్న వారి సహాయం కోసం వేసిన ఒక గొప్ప అడుగు. ఇది వేలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచింది.

లారీలు ఎక్కువగా ఉన్నందువలన భారీ వాహనాలను నిలిపెందుకు అనువైన పార్కింగ్, మరమత్తులు, అన్వేషణలను ప్రోత్సహించే ఆటోపార్క్ అవసరం. వలసలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్యాన, ప్లోరికలట్చర్ అభివృద్ధికి అనువైన పరిశోధనా కేంద్రాలు స్థాపించి, పువ్వులనుండి తయారయ్యే ఉత్పత్తులు ప్రోత్సహిస్తే, స్థానికుల ఉఫాధి అవకాశాలు మెరుగుపడతాయి. తాగునీటి సమస్య, పారిశుద్య్యం, విద్యుత్తు సరఫరాలు మెరుగుపరచాలి . మండలంలో విజృంభిస్తున్న ఫైలేరియా మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణకు తగినన్ని వైద్య సదుపాయాలూ కల్పించాలి. విద్య, ఉఫాధి అవకాశాలు మెరుగుపరచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు తోడ్పడాలి.  ప్రజలకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించే వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం వంటివి ఇక్కడి తక్షణ అవసరాలు.

సాలూరు నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి