ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పరవాడ మండలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో పరవాడ మండలంలో ఒక పట్టణం. ఈ పట్టణం విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యాలయం నుండి పశ్చిమాన 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరవాడ మండల ప్రధాన కార్యాలయం. పశ్చిమానికి మునాగాపాక మండలం, ఉత్తరాన అనకాపల్లి మండలం, దక్షిణాన అచ్చుతాపురం మండలం, తూర్పు వైపు పెదగంట్యాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

అనకాపల్లె, విశాఖపట్నం, నర్సిపట్నం, భీమునిపట్నం సమీపంలోని నగరాలు పరవాడాకు చెందినవి. పరవాడ మండలం 79 గ్రామాలు, 17 పంచాయితీలు కలిగి ఉంది. ఈ మండలంలో జగన్నాధపురం అగ్రహారం అతి చిన్న గ్రామం మరియు చీపురుపల్లె అతి పెద్ద గ్రామం. విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం, అనంతగిరి, అరకు లోయ మొదలైనవి పర్యాటకులు చూడడానికి పరవాడకు దగ్గరలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు.

పరవాడ 2011 సెన్సస్ వివరాలు

పరవాడలో తెలుగు భాషను ప్రధాన భాషగా వాడుతారు. పరావాడ పట్టణం మొత్తం జనాభా 78,165, మండలంలో మగవారి సంఖ్య 39,430 ఆడవారి సంఖ్య 38,735. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 59.07% ఇందులో పురుషులు 69.83% మంది మరియు స్త్రీలు 47.89%.

ఈ పట్టణ సమస్యలు

ఈ మండలంలోని తాడి ప్రజలు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నారు

కాలుష్య రక్షసి కోరల్లో తాడి (రికార్డుల్లో గ్రామం లేదు, వాస్తవంగా ఉంది) :

పరవాడకు సమీపంలోని తాడి గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ గ్రామాన్ని వెంటనే తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యం నుంచి తమకు కాపాడాలని స్థానిక అధికారులకు, పాలకులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేక పోయింది. భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమైపోయాయి. గ్రామానికి ఆనుకునే రసాయన కర్మాగారాలు ఉండడం వల్ల వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలను హరించేస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. మహిళలకు తరుచూ గర్భస్రావాలు అవుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకనాటి అందమైన ఈ గ్రామం స్మశానంగా మారిపోతోంది. పక్కా భవనాలను సైతం విడిచి తాము బయటికి వెళ్ళిపోడానికి సిద్ధంగా ఉన్నామని స్థానికులు సర్కార్ ను వేడుకుంటున్నారు. అయినా పాలకులకు చలనం లేదు. తామే బయటకు వెళ్లిపోతామని కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ప్రభుత్వ రికార్డుల్లో ఈ గ్రామాన్ని ఏనాడో తరలించినట్టు చూపించడం. సర్కార్ దృష్టిలో ఈ గ్రామం లేదు. వాస్తవానికి ఆ గ్రామం అలానే ఉంది. రికార్డులను మసి పూసి మారేడు కాయ చేసి ఇబ్బడిముబ్బడిగా రసాయన పరిశ్రమలను స్థాపించేశారు. ఇంకో భయంకరమైన విషయం ఏమంటే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి రసాయన వ్యర్ధాలను తీసుకువచ్చి గ్రామానికి కేవలం కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన ల్యాండ్ ఫిల్లింగ్ లో నింపేస్తున్నారు. ఇప్పుడది ఎత్తైన కొండ మాదిరిగా తయారయ్యింది. ఆ వ్యర్ధాలు భూమిలో కలసిపోయి చుట్టు పక్కల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు గానీ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలు కూడా అలసిపోయారు. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదు తెలియని స్థితికి వచ్చేసారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరికి తమ ప్రాణాలు ఈ మట్టిలోనే కలసిపోతాయేమోనని భయం తాడి ప్రజలకు పట్టుకుంది. మహా విశాఖ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న తాడి గ్రామం నూరు శాతం కాలుష్యంలో చిక్కుకుంది. ప్రజలంతా ముక్త కంఠంతో తమ గ్రామాన్ని వేరే చోటకు తరలించాలని ఏళ్ల తరబడి కోరుతున్నారు. ఎందుకనో ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎవరి ప్రాపకం కోసం ఈ గ్రామాన్ని తరలించడం లేదో ఎవరికీ అర్ధం కావడం లేదు.

పెందుర్తి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి