ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అత్యంత ఎక్కువ తలసారి ఆదాయం ఉన్న గాజువాక లో మౌలిక వసతుల కొరత ఎందుకు?

విశాఖపట్నం దక్షిణ భాగం లో ఉన్న గాజువాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇది 'విశాఖపట్నం' విమానాశ్రయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోను, విశాఖ రైల్వే స్టేషన్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, రైలు, రోడ్లు మరియు విమాన సర్వీసులకు అతి చేరువలో ఉన్న వ్యాపార కూడలిగా ప్రసిద్ది చెందినది. విశాఖపట్నం జిల్లాలోని 46 మండలలో ఒకటిగా ఉన్న ఈ అసెంబ్లీ నియోజక వర్గం పాలనాపరంగా గ్రేటర్ విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ పరిధి లో ఉన్నది. ఈ నియోజకవర్గం పరిధి గాజువాక మండలం ఇంకా గాజువాక మున్సిపాలిటీ వరకు విస్తరించి ఉన్నది. 2, 64, 322 రూపాయల తలసరి ఆదాయంతో, గాజువాక రాష్ట్రం లోనే అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన శాసనసభ సెగ్మెంట్ గా పేరొందింది. అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన సెగ్మెంట్ అయినప్పటికీ, ఈ ప్రాంతం లో అనేక ఆర్థిక అసమానతలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం, ఈ సెగ్మెంట్లో 2.5 లక్షల జనాభా కలిగియున్నది. వీరిలో 1.3 (51%) లక్షల మగవారు, మరియు 1.2 (49%) లక్షల ఆడవారు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, ప్రతి 1000 మంది మగవారికి 963 మంది ఆడవారు ఉన్నప్పటికీ, 6 ఏళ్ల లోపు వారిలో బాలికలశాతం చాలా తక్కువగా (1000:8) ఉంది. భవిష్య్తతులో ఇది స్త్రీ-పురుష నిష్పత్తిని బాగా ప్రభావితం చేస్తుంది. మహిళా శిశు సంక్షేమశాఖ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ నియోజకవర్గం లో 88% మంది మగవారు 76% మంది మహిళా అక్షరాస్యులు ఉన్నారు. ఇది దేశ సగటు కంటే ఎక్కువే. వీరి లో 56 శాతం మగవారు 13 శాతం స్త్రీలు సంపాదనపరులు. వీరు చిన్న, లేదా ఒక మోస్తరు వృత్తి లేదా వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు. జనాభాలో మహిళా ఉద్యోగుల శాతం చాలా స్వల్పం. మహిళల విద్య, ఉఫాధి రంగం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో వ్రుత్తి లేదా వ్యాపారవకాశాలు కలిగినవారి సంఖ్య 35% శాతం మాత్రమే. నిరుద్యోగుల సంఖ్య తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరం. మొత్తం మీద ఇక్కడి అక్షరాస్యత లో పెద్ద మార్పు లేదు. పురుషులలో 4% అక్షరాస్యత పెరిగితే, మహిళలో 2% అక్షరాస్యత మాత్రమే పెరిగింది. ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉన్నప్పటికీ అక్షరాస్యత తక్కువగా ఉన్న కారణాలు అన్వేషించాలి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు అద్వాన్నంగా మారుతున్న ఈ పరిస్థితులలో గాజువాక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేలకు వేలు ఖర్చయ్యే ప్రవేటు పాఠశాలల దోపిడీ వలన విద్య అందరికి అందుబాటులో లేదు. ప్రభుత్వమే అందరికి నాణ్యమైన ప్రాధమిక, మరియు సెకండరీ విద్య అందించాలి.

జిల్లాలో ఉన్న అన్ని భారీ పరిశ్రమలు గాజువాక ప్రాంతంలోనే కేంద్రీకరించబడ్డాయి. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, విశాఖ ఉక్కు కర్మాగారం, ఇంకా ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. అనేక వ్యాపార, పరిశ్రమ, అనుబంధ సంస్థలు ఇక్కడే ఉన్నందువలన పరిశ్రమల నుండి, ముఖ్యంగా ఓడ రేవుల వలన, అధిక కాలుష్యం వెలువడుతుంది. వాతావరణ కాలుష్యం ఇక్కడి ప్రజలను అనేకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. ఈ పరిశ్రమలలో స్థానిక విద్యార్థులకు, యువతకు ఉఫాధి అవకాశాలు తక్కువే. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు దేశవ్యాప్తంగా ఉదోగస్తులను ఎంపిక చేస్తుంది. కాని ఈ పరిశ్రమల అనుబంధ సంస్తలలో స్థానికులకు మాత్రమే ఉఫాధి అవకాశాలు కల్పించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణం గా ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఫలితంగా ఇరుకైన రోడ్లు, అధిక రద్దీ కలిగిన జనావాసాలుగా మరియు మార్కెట్ ప్రదేశంతో నిండిపోయింది. వెపేరీతంగా పెరిగిన వాహనరద్దీ పరిశ్రమలకాలుష్యానికి తోడై ఈ ప్రాంతాన్ని అతంత కాలుష్య నగరం గా మార్చేసింది. నగరంగా ఎదిగే దశలో అన్ని పట్టణాలు ఎదుర్కొన్న సమస్యలను గాజువాక ఎదుర్కొంటున్నది. దశాబ్దాలుగా ఇక్కడి రహదారుల వెడల్పు, ఇంకా సంఖ్య పెరగలేదు. అధిక జన సాంద్రతతో బాటు, పరిశ్రమల కాలుష్యం ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రోడ్లు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్యనందించే పాఠశాలలు ఇంకా మౌలిక వసతులు కల్పిచకుంటే గాజువాక మురికి కూపంగా మారుతుంది. ఇక్కడి ప్రజలు తీవ్ర శారీరక, మానసిక ఇక్కట్లు ఎదుర్కోవలసిందే. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతం లో కేంద్రీకరించకుండా, ఎక్కువ పన్నులు చెల్లించే ప్రజలకు కనీసవసతులు కల్పించడం తక్షణ కర్తవ్యం.

ఉద్యోగ, వ్యాపార, మహిళా, ప్రజాహక్కుల సంఘాలు ప్రజలలో ఉన్నత జీవన ప్రమాణాలు సాదించడంలో పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు , ఇంకా గాలి ఆవశ్యకత పై అవగాహన కల్పించాలి. ఈ సంఘాలన్నీ, కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు, ఇంకా నగరపాలక సంస్థలు భాద్యతాయుతం గా తమ విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తేవాలి. కనీస మౌలిక సదుపాయాలకు స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, ప్రజలను కుడా అందు లో భాగస్వామ్యములను చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

గాజువాక నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి