ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ప్రత్తిపాడు నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, ప్రత్తిపాడు ఒకటి. 19 శతాబ్దిలోనే ఆంగ్ల విద్యాలయాలు నెలకొన్న ప్రాంతాలలో ఇది ఒకటి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పన్నుల నిరాకరణ ఉద్యమం, పెదనందిపాడు నుంచే మొదలయింది.

పూర్వం ప్రాంతాన్ని "భక్తులవాడ"గా పిలిచేవారని చరిత్ర కథనం. అనంతరం అది "భక్తిపాడు"గా మారిందని, ప్రత్తి పంట బాగా పండేది కనుక తొలుత "ప్రత్తిపాడు"గా మారిందని శాసనాలు చెపుతున్నాయి. నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 184820 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 92910 కాగా మగవారి సంఖ్య 91895. పొగాకు, మిరప మరియు పత్తి ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • శ్రీ గంగాపార్వతీ సమేత దండేశ్వర స్వామి ఆలయం
  • శ్రీ వేణుగోపాల సీతారామస్వామివారి ఆలయం

నియోజకవర్గపు ప్రముఖులు:

జాగర్లమూడి వీరాస్వామి (.పి.పి.ఎస్.సి. ఛైర్మన్, హేతువాది కులనిర్మూలన సంఘ అధ్యక్షుడు).

నియోజకవర్గపు సమస్యలు:

  • ఇక్కడి రైతుల ప్రధాన సమస్య, నల్లమడ డ్రెయిన్. కాచ్మెంట్ ఏరియాలో మాదిరి వాన కురిసినా, నీరంతా చివరి భూములకు చేరి పంటలు వరద పాలవుతున్నాయి.
  • నియోజకవర్గం మొత్తం తాగు నీటి సమస్యతో కటకటలాడుతుంది.
  • సగానికి పైగా కబ్జా అయిన కాట్రపాడు చేరువు.
  • గ్రామాల్లో ఇప్పటికి గ్రావెల్ రోడ్డులే ఉన్నాయి.
Top