ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గుంటూరు తూర్పు నియోజకవర్గం

గుంటూరు జిల్లాకు గుండెకాయ లాంటిది, తూర్పు నియోజకవర్గం. గుంటూరు యొక్క ప్రాచీన నామము గర్తపురి. భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము గుంటూరు - మంగళగిరి మధ్యలో ఉంది. గుంటూరు, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం. రాష్ట్రం మొత్తానికి పాత వాహనాల స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే మాయాబజార్ పరిధిలోనే ఉంది.

నియోజకవర్గంలో ఒక లక్షా 94 వేల మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు నగరానికి విద్య, ఆరోగ్య రంగాలలో మంచి గుర్తింపు గలదు. ప్రాంతం, పొగాకు వ్యాపారానికి మరియు మిర్చి, పత్తి ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి చెందినది. మిర్చి శీతల గిడ్డంగులు ( కోల్డ్ స్తోరేజేస్ ) ఎక్కువగా ఉన్నప్రదేశాలలో గుంటూరు ఆసియాలోనే రెండవ స్థానంలో ఉంది. తొలి భారత కళాశాలలో ఒకటైన ఆంధ్ర క్రైస్తవ కళాశాల 1885లో గుంటూరులో స్థాపించబడింది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • అన్నమయ్య గ్రంథాలయం - దాదాపు 80 వేల గ్రంథాలతో అలరారుతున్న గ్రంథాలయం.
  • శంకరవిలాస్
  • సింగపూర్ షాపింగ్ మాల్
  • మిర్చి యార్డు
  • జిన్నా టవర్
  • కుగ్లర్ హాస్పెటల్

నియోజకవర్గపు ప్రముఖులు:

నాయని కృష్ణకుమారి

మాడభూషి వెంకటాచారి - కమ్యూనిస్టు నేత, అధ్యాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు

నియోజకవర్గపు సమస్యలు:

  • ఒకే చోట 150 ఆసుపత్రులు ఉన్నా శానిటేషన్ ఘోరం.
  • వారానికి ఒకసారి మాత్రమే వచ్చే మంచినీళ్ల ట్యాన్కర్.
  • నియోజకవర్గంలో అంతర్గత రోడ్డులే కాదు ప్రధాన దారులు కూడా దారుణంగా ఉన్నాయి.
  • శివార్లలో కనీసం సైడ్ కాలువలు కూడా నిర్మించలేదు.
  • సెగ్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది.
  • కొన్ని ఏరియాల్లో కనీసం వీధి దీపాలు లేవు.
Top