వినుకొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. వినుకొండ అన్న పేరు ఈ గ్రామంలో శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్లంటే రాష్ట్రంలో ఎంత గుర్తింపు ఉందో, వినుకొండ పాలకు మరియు స్వీట్స్ కు మార్కెట్లో అంత గిరాకీ ఉంది. నాణ్యత, రుచిలో ఈ పాలకు పెట్టింది పేరు.
ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 230210 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 115688 కాగా మగవారి సంఖ్య 114504. నియోజకవర్గం మొత్తం వ్యవసాయ ఆధారం. వరి, అపరాలు మరియు కాయగూరలు ఇక్కడి వాణిజ్య పంటలు.