ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సమస్యలు చాంతాడంత ఉన్నా, విజయనగరం అభివృద్ధికి నిధులు సున్నా!

విజయనగరం పట్టణం జిల్లా కేంద్రం, మండల కేంద్రంగానే కాకుండ అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా వ్యవహరిస్తున్నది. ఇది విశాఖపట్నానికి ఈశాన్య దిశలో 42 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, బంగాళాఖాతానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 74 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ పట్టణం గుండా నాగావళి, వేగావతి, గోముఖి, సువర్ణముఖి, చంపావతి , గోస్తనీ వంటి నదులు ప్రవహిస్తున్నాయి.

విజయనగరం దరిదాపుల్లో యెన్ని నదులు ప్రవహిస్తున్నా జిల్లా కేంద్రంమైన విజయనగర పట్టణంలో మాత్రం తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నది ప్రవహించే వర్షాకాలంలో ఆ నీటిని నిలువ చేసుకొనే వీలుగా తగినన్ని రిజర్వాయర్ల నిర్మాణం ఇంకా అనేక దశలలో అసంపూర్తిగా ఉండటంతో బాటు, శీతాకాలంనుండే నీటి నిలువలు పడిపోవడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం వారంలో రెండు రోజులు మాత్రమే నీటిని ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణానికి ప్రతిరోజు 36 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా, ముసిదిపల్లి (తాటిపుడి రిజర్వాయర్) నుండి 9 మిలియన్, రామతీర్ధాలు మరియు నెల్లిమార్ల (నది చంపావతి) పథకాల నుండి 7 మిలియన్ లీటర్ల నీటి లభ్యత మాత్రమే ఉండటంతో అన్ని సీజన్లలో ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంటుంది.

తాగు నీటి సమస్య తరువాత ఈ పట్టణంలో అతి పెద్ద సమస్య ఇరుకయిన రహదారులు, పారిశుద్ధ్యం లేమి. విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాస్తవానికి ఈ పట్టణాన్ని ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి పెంచలేదు. తారకరామా తీర్ధసాగర్ కు మరిన్ని నిధులు కేటాయిస్తే, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్న స్థితిలో ఉండటంతో, మురుగునీరు వీధులలోనే ప్రవహిస్తూఉంటుంది. విజయనగరం అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి నిధులు లేకపోవడమే. ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి సాధ్యమే.

విజయనగరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి