ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

భీమునిపట్నం మండలం

భీమునిపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. భారతదేశంలో రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్ర ప్రదేశ్‌లోని మొట్టమొదటి మునిసిపాలిటీ (భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం). ఇప్పటికి కుడా మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంటుంది. ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుపై చివరిన ఉంది.

భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల భీమిలి పట్టణం పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే పకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధక్షేత్రం పావురాళ్ళకొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలి బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.

చరిత్ర

బుద్ధుని అవశేషాలలోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైందట.1641వ సంవత్సరంలో హైదరాబాదు నవాబు అబ్దుల్లా కులీకుతుబ్‌ షా నుండి అనుమతి పొందారు డచ్‌ దేశస్థులు.1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ల మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 లో భీమిలి రేవు పట్టణం బ్రిటిష్‌వారి వశమైంది. 1854లో రిప్పన్‌ కంపెనీని ప్రారంభించారు.

శీర్షిక ... యాత్రా చరిత్ర, రచయిత మండపాక పార్వతీశ్వర శాస్త్రి తన గ్రంథములో.... పుట 6 లో భీముని పట్నం గురించి ఇలా వ్రాసి యున్నారు.

సముద్రతీరమందు భీముని పట్టణమున్నది. ఇందులో మునసబు వగైరాల ఖచేరీలున్నవి. దొరలు సైతమున్నారు. రేవుస్థలమైనందున ధనిక వర్తక భూయిష్టమైయున్నది. ఇది కొండదిగువనున్నందున నిమ్నోన్నతముగా నున్నది.

భీమునిపట్నం మండలంలోని మొత్తం ఇళ్ళు 21781, మొత్తం 88 గ్రామాలు, 22 పంచాయితీలలో 99,620 మంది నివసిస్తున్నారు. పురుషులు 49,892 మరియు స్త్రీలు 49,728 మంది. 48,664 మంది పట్టణంలో నివసిస్తున్నారు మరియు 50,956 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

రవాణా

రోడ్డు మార్గం ద్వారా భీమిలి బాగా అనుసంధానించబడి ఉంది. ఎన్ హెచ్16 లేదా ఎ హెచ్ 45 రోడ్డు మార్గం భీమునిపట్నం మండలం గుండా వెళుతుంది. ఇది ప్రధాన జిల్లా రహదారులను మరియు రాష్ట్ర రహదారులను సమీపంలోని మండలాలను మరియు విశాఖపట్నంకు అనుసంధానిస్తుంది.

ప్రసిద్ద దేవాలయం (నరసింహ దేవాలయం) భీమిలి సముద్ర తీరానికి తూర్పు వైపున ఉన్న పావురాళ్ళకొండ మీద నరసింహ స్వామికి అంకితం చేసిన హిందూ దేవాలయం ఉంది. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 14 వ శతాబ్దంలో మిండి రాజుల చేత నిర్మించబడింది. భీమిలి పట్టణంలో చోళుల కాలం నాటి మరో రెండు ఆలయాలు ఉన్నాయి, అవి భీమేశ్వరాలయం మరియు చోళేశ్వరాలయం వంటివి.

భీమిలి ఆకర్షణలు

పావురాళ్ళకొండ బౌద్ధ విహారం వద్ద రాతిలో తొలచబడిన తొట్లు పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ళకొండ, ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం, ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి క్రీ.శ రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కొండపై నున్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు.

భీమిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి