ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

వేమూరు నియోజకవర్గం

వేమూరు నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గం, 1962 సంవత్సరంలో ఏర్పడింది. ప్రాంతంలోని, కొల్లూరు ఇటుకలకు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరుంది. నియోజకవర్గపు పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుంటూరు జిల్లాలోనే ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. సినీ, రాజకీయ రంగాలలో వేమూరు నియోజకవర్గనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయా రంగాలలో పలువురు ఉద్దండులు ప్రాంతానికి చెందినవారే కావటం విశేషం.

నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 185485 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 94226 కాగా మగవారి సంఖ్య 91246. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. వరి, అపరాలు మరియు కాయగూరలు నియోజకవర్గపు ప్రధాన పంటలు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

కొణిజేటి రోశయ్య సమావేశ మందిరం - మందిరాన్ని, శ్రీ కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు.

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము - ఆలయానికి రెండు శతబ్దాల చరిత్ర ఉంది.

నియోజకవర్గపు ప్రముఖులు:

  • నాదెండ్ల భాస్కరరావు
  • తాడేపల్లి లోకనాథ శర్మ (శాస్త్రీయ సంగీత విద్వాంసులు)
  • నిమ్మగడ్డ బ్రహ్మయ్య - చాలా కాలం గ్రామ సర్పంచ్ గా పనిచేశారు.

నియోజకవర్గపు సమస్యలు:

  • కృష్ణా నది పరివాహక ప్రాంతమైనప్పటికీ, గ్రామాల్లో ఉప్పు నీటి సమస్య తీవ్రంగా ఉంది.
  • 2007 లో మూతపడ్డ జంపని షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఇక్కడి ప్రజల డిమాండు.
  • అమర్తలూరు -నిజాంపట్నం రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆరోపణ.
  • సుండూరు మండలంలోని రోడ్లు దారుణంగా ఉన్నాయంటున్ననివాసితులు.
  • ఇసుక దందా ఒక పెద్ద సమస్యగా మారింది నియోజకవర్గంలో.
Top