ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నిరక్షరాస్యతా, నిరుద్యోగం ఎచ్చెర్ల నియోజకవర్గం వాసుల జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో తక్షణ నివారణ చర్యలు అవసరం

శ్రీకాకుళం జిల్లాలో గల ఎచ్చెర్ల, మండల కేంద్రం మరియు అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా వ్యవహరిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎచ్చెర్ల జనాభా 87,847. అందులో 44,660 మంది పురుషులు, 43,187 మంది మహిళలు ఉన్నారు. ఎచ్చెర్ల అక్షరాస్యత 50%. మొత్తం 87,847 జనాభాలో 44,235 మంది చదువుకున్నవారు ఉండగా, ఈ మండలంలో నిరక్షరాస్యులు శాతం 49% ఉంది. ఇందులో పురుషుల నిరక్షరాస్యత 41% కాగా మహిళలలో నిరక్షరాస్యత 57%గా ఉంది.

ఎచ్చెర్ల జనాభాలో 41859 మంది ప్రజలకు మాత్రమే ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు దొరికాయి. ఫలితంగా, ఎచ్చెర్ల లో 45988 మంది నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు 15% ప్రజలు వ్యవసాయంపైననే ఆధారపడగా, మిగిలినవారు వ్యవసాయ కూలీలుగా, స్వయం ఉపాధి పొందినవారుగా, ఇంకా చిన్న వ్యాపారస్తులుగా జీవనం సాగిస్తున్నారు. నిరక్షరాస్యత, నిరుద్యోగం రెండు చెట్టపట్టాలు వేసుకుని ఈ నియోజకవర్గ ప్రజల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది.

2,12,150 మంది ఓటర్లున్న ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో జి. సింగడం, లావేరు, ఎచ్చెర్ల ఇంకా రణస్థలం మండలాలు ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, విద్య, ఉఫాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలంటే విద్యా రంగంలో ముఖ్యంగా బాలికల, మహిళల విద్యలో సమూలమైన సంస్కరణలు అవసరం. ప్రాధమిక విద్యను పటిష్టం చేయడంతోబాటు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచాల్సి ఉంది. మహిళా డిగ్రీ కళాశాల కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే విద్యారంగంలో ప్రభుత్వం కొంత పురోగతి సాధించింది. ఆంద్ర విశ్వవిద్యాలయం పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్ను పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా మార్చాలని 103 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ద్వారా యువతకై వసతి గృహాలు, రూ. 2 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక సౌకర్యాలతో యువతకై క్రీడ శిక్షణా కేంద్రం, 4 ఎకరాల భూమిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా సదుపాయం, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి డ్రైవింగ్ ట్రాక్, మరియు బాలికల ఐటిఐ అభివృద్ధి కొసం 2 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది.

ఇక సాగు నీటి విషయానికి వస్తే, నారాయణపురం ఎడమ కాలువ తోటపల్లె కాలువల ద్వారా సాగు నీటిని అందుబాటులోకి తెచ్చి, బుడమేరు చెరువును రిజర్వాయరుగా మార్పు చేస్తే , 58 వేల ఎకరాల సాగుభూమికి నీరందించవచ్చని అంచనా. బుడమేరు చెరువు నీళ్లు కలుషితమై నిరుపయోగంగా ఉంది. దీనిని సంరక్షించి, జలాశయంగా మారిస్తే ఈ ఒక్క చెరువునుండి 15,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. నీటిని నిలువచేసే రిజర్వాయర్ లేకపోవడంతో ప్రస్తుతం ఒక్క బుడమేరు పంచాయతీ భూములకు మాత్రమే సాగునీరందుతుంది. నారాయణ సాగరం ఈ ప్రాంతంలో అతిపెద్ద మంచినీటి చెరువు. నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తే, రెండు పంటలకు ఈ ప్రాంతంలోసాగు నీటికి, తాగునీటికి కొరత ఉండదు.

ఇక ఉపాధి విషయానికి వస్తే పైడి భీమవరంలో అతిపెద్ద పారిశ్రామిక సముదాయం ఉన్నా స్థానికులకు మాత్రం అందులో అవకాశాలు లేవు. ప్రజలకు ఉఫాధి అవకాశాలు పెంచే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకై పూనుకోకుండా ప్రభుత్వం అతిప్రమాదకరమైన అణు ధార్మికతను వెదజల్లే అణు విద్యుత్ కర్మాగారాన్ని కొవ్వాడలో నిర్మించ తలపెట్టింది. దీనికి స్థానికులనుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ప్రజామోదం పొందే రీతిలో పరిశ్రమల స్థాపన జరిగితే అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుంది.

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి