ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నరసన్నపేటలో అక్రమ ఇసుక తవ్వకం అరికట్టి ప్రాధమిక వసతులకల్పన పై తక్షణం దృష్టి సారించాలి

జిల్లా కేంద్రం శ్రీకాకుళం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసన్నపేట, మండల కేంద్రం, జనాభాగణన పట్టణం, శాసనసభ నియోజకవర్గం మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వ్యవహరిస్తున్నది. సముద్ర మట్టానికి కేవలం 18 మీటర్ల ఎత్తులో ఉన్న నరసన్నపేటలో 2011 జనాభా లెక్కల ప్రకారం 26,280 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ అక్షరాస్యత 79.%.

నరసన్నపేటలో విద్య, వైద్యం, రహదారులు, పారిశుద్యం ప్రధాన సమస్యలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రాధమిక వసతులైన సురక్షిత భవనాలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు లేమితో కొట్టుమిట్టాడుతూ ఉంటె, అరకొర వసతులతో ప్రవేటు యాజమాన్యంలో నడిచే బడులకు ఆదరణ పెరిగిపోతున్నది. ప్రభుత్వ వైద్యశాలలు సైతం స్వంత భవనాలు, మందులు, పడకలు , వైద్య సిబ్బంది వంటి కనీస సౌకర్యాలు లేక రోగులను అవస్థలకు గురిచేస్తున్నాయి. రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటె, తాగునీరు, సాగునీరు పూర్తిగా కొరవడ్డాయి. వంశధార రెండవ దశ పూర్తయితే వరి, చెరకు పంటలకు నీరు అందించవచ్చు. సాగు అంతంత మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గ పరిదిలో పరిశ్రమలేవి లేకపోవడంతో ఉఫాధి అవకాశాలు లేక ప్రజలు వలసబాట పడుతున్నారు.

నరసన్నపేట పారిశుద్ధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధభూయిష్టమైన పరిసరాలు దర్శనమిస్తాయి. నదులు, సముద్ర తీరం పుష్కలంగా ఉన్న ఈ మండలంలో ఇసుక అక్రమ రవాణ పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తున్నది. ప్రకృతి విపత్తులతో నిత్యం పోరాడే శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వే ఇసుక మాఫియా వేలకోట్లు సంపాదిస్తుంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతుంది. అన్ని తెలిసిన పాలకులు తగిన చర్యలు తీసుకోకుంటే, భవిష్యత్తులో భూగర్భజలాలు అడుగంటిపోతాయి.

నరసన్నపేట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి