ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చిలకలూరిపేట నియోజకవర్గం

చిలకలూరిపేట, గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరొందింది ప్రాంతం నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 201214 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 103523 కాగా మగవారి సంఖ్య 97675. 

 బ్రిటిషు వారు దీనిని చిక్పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు. జిల్లాలో మొదటిసారిగా పరిశ్రమలు ఏర్పాటు అయింది నియోజకవర్గంలోనే. రాష్ట్రంలో తొలి ఎత్తి పోతల పథకం ప్రారంభించింది ప్రాంతంలోనే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పత్తి మరియు మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం, కోటప్పకొండ మరియు క్లాక్ టవర్.

నియోజకవర్గపు ప్రముఖులు:

చిలకలూరిపేట, ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి అందించింది. మరెందరో పట్టణంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆచార్య రంగా, కాసు బ్రహ్మానంద రెడ్డి మొదలైనవారు పేటతో అనుబంధం ఉన్న వ్యక్తులు.

నియోజకవర్గపు సమస్యలు:

  • పట్టణంలో, తాగు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది.
  • అధ్వాన్నంగా మారిన డ్రైనేజి వ్యవస్థ.
  • దుమ్ము, ధూళి మరియు అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలు.
  • నిరుద్యోగం కూడా ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్య.
Top