ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మాచెర్ల నియోజకవర్గం

మాచెర్ల శాసనసభ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. క్రీ.. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. హైహయరాజుల కాలంలో ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచర్లగా రూపాంతరంచెందిందని చరిత్రకారుల కథనం.

నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 238236. అందులో ఆడవారి సంఖ్య 120646 కాగా మగవారి సంఖ్య 117573 గా నమోదయింది. పత్తి, మిరప, వరి ఇక్కడి ప్రధాన వాణిజ్య పంటలు. నాణ్యమైన నాపరాయికి ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.

ప్రసిద్ధ ప్రదేశాలు:

పట్టణము హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయమునకు ప్రసిద్ధి. దేవాలయము 12-13 శతాబ్దాలలో నిర్మించబడింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు:- మాచర్లకు 25 కి.మీ. దూరంలో ఉంది.

ఓటిగుళ్ళు - పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు.

నియోజకవర్గపు ప్రముఖులు:

షేక్ చిన లాలుసాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు.

నియోజకవర్గపు సమస్యలు:

  • నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులు.
  • గ్రామాల మధ్య ఘోరంగా తయారైన రోడ్లు.
  • నిరష్కరాస్యత ఎక్కువగా ఉండడంతో ఎటు చూసిన వెనకబాటుతనం.
  • వీధి దీపాలు సరిగ్గా లేని ప్రాంతాలు ఎన్నో.
  • బస్సు షెల్టరుని కొందరు ఆక్రమించి నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Top