ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కురుపాం పట్టణం రూపురేఖలు మారేదెప్పుడు?

విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ఒక గ్రామం పేరు కురుపాం. మండల కేంద్రంగానూ, అసెంబ్లీ నియోజకవర్గంగానూ వ్యవహరిస్తున్న కురపాం మండల జనాభా 46, 439. స్త్రీ పురుష నిష్పత్తి జనాభాలో సమానంగా ఉండే ఈ మండలం అత్యంత తక్కువ అక్షరాస్యత (46%) కలిగి ఉంది. దీనిలో మగవారి అక్షరాస్యత 57% ఉంటే, మహిళల్లో కేవలం 35% మంది మాత్రమే అక్షరాస్యులు. రాజరిక చరిత్ర నేపథ్యం గల కురుపాం ప్రస్తుతం షెడ్యూల్ తెగలకై రిజర్వు చేయబడిన అసెంబ్లీ నియోజకవర్గం. కురపాం మండలంలో సామాజీలకు కొదవలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఇంకా ప్రాధమిక వసతులు లేవు. ఘనమైన చారిత్రక నేపథ్యంగల ఈ ప్రాంతం ఇప్పుడు ప్రాధమిక వసతులకు కూడా నోచుకోలేదు. మంచినీటి సరఫరా, రోడ్లు, పాఠశాలలు, మహిళా కళాశాలలు, గుమ్మడిగెడ్డ జలాశ్యామ్ పూర్తయితే 6 వేల ఎకరాల భూమికి నీరందించవచ్చు. గిరిజనులు సేకరించే ఆటవీ ఉత్పత్తులను అమ్మడానికి గిరిజనముల డెవలప్మెంట్ కార్పొరేషన్ ను నెలకొల్పితే, దళారుల దోపిడీనుండి వీరిని కాపాడవచ్చు.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి