ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తితిలీ తుఫాను దాటికి వట్టిపోయిన పలాస జీడిపరిశ్రమ స్థానంలో జీవనోఫాది భరోసా ఇచ్ఛేవారెవరు? వలసలను తప్పించేదెవ్వరు?

జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి తూర్పు వైపు 88 కిలోమీటర్ల దూరంలో ఉంది పలాస పట్టణం. ఇది మండల కేంద్రంగా వ్యవహరిస్తున్నది. పది సంవత్సరముల కిందట పలాస ఒక పెద్ద గ్రామము. జీడి పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్టణ వాతావరణము నెలకొని ఉంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. 1996లో దీన్ని నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పలాస మండల జనాభా 97,551. అందులో 47,915 మంది మగవారు, 49,636 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 59 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, 41 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 75.7%, గ్రామీణ ప్రాంతాల్లో 62.5%.

పలాస మండలంలో 45,182 మంది వివిధ వృత్తి, ఉఫాధి కార్యక్రమాలలో నిమగ్నులై ఉన్నారు. వీరిలో 4,947 మంది వ్యవసాయదారులు (యజమాని లేదా సహ-యజమాని), 8,567 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. మిగిలినవారు వివిదవృత్తి, చిన్న వ్యాపారస్తులుగా, జీడీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ, జీవనం గడుపుతున్నారు. ఈ గణాంకాలను ఆధారంగా చూస్తే, 80శాతం కంటే ఎక్కువమంది కూలీలు, కార్మికులు అని అర్ధమౌతుంది. పలాస రైల్వే స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో రట్టి, అకుపల్లి, మెట్టూరు మరియు తోతురు (హనుమాన్ సాగర్) సముద్ర తీరాలు ఉన్నాయి. పలాస మండలంలో కాశీబుగ్గ మున్సిపాలిటీ పట్టణం. ఇది శ్రీకాకుళం మరియు బెర్హంపూర్ మధ్య 5 వ జాతీయ రహదారిలో ఉంది ఈ జంట పట్టణాలలో భారతదేశంలోనే అతిపెద్ద జీడి పిక్కల పరిశ్రమల కేంద్రాలు కేంద్రీకరించి ఉన్నాయి. పలాస పట్టణంలో దాదాపు 350 జీడి పిక్కల పరిశ్రమలు ఉన్నాయి. జీడి పరిశ్రమ ఈ ప్రాంతలో సుమారు 15,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. పలాస, కాశీబుగ్గ నుండి జీడిపప్పు గల్ఫ్, ఐరోపా మరియు పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జీడి ప్రాసెసింగ్ పరిశ్రమల కారణంగా ఈ పట్టణం “వైట్ గోల్డ్ సిటీ” గా పేరుగాంచింది.

మండలం మొత్తం మీద చూస్తే ఉఫాధి ప్రధాన సమస్య. జీడీ పరిశ్రమ తప్ప ఉఫాధి అందించే మార్గాలు తక్కువ. తితిలీ తూఫాన్ దాటికి నష్టపోయిన జీడిచెట్లు మళ్ళీ ఉత్త్పత్తి చెయ్యాలంటే మరో 10 సంవత్సరాలు పడుతుంది. సరైన జీవనాధారం లేకపోతె పట్టణాలన్నీ వలసలతో ఎడారులుగా మారిపోతాయి. ప్రాధమిక వసతులైన తాగునీరు, వైద్యం, విద్యా రంగాలపై పాలకులు దృష్టిని కేంద్రీకరించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం స్వంత భవనాలు, ప్రాథమిక వసతులు లేవు. జీడీ పరిశ్రమలో పనిచేసే . కార్మికులు పెన్షన్, వైద్య సదుపాయాలు లేక రోజు కూలీలా మాదిరి పనిచేస్తున్నారు.వీరు అధికంగా చర్మ, ఊపిరితిత్తుల రోగాలబారిన పడుతున్నారు. వీరి జీవితాలకు కనీస భద్రతా, వైద్య సదుపాయాలూ కల్పించాలి. మండలంలో పారిశుద్ధ్యం, రహదారులు ప్రధాన సమస్యలు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, కల్పించి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

రైతులు సాగునీటి లేమి, నకిలీ విత్తనాల వలన ఇబ్బందులు పడుతుంటే, మత్స్యకారుల గ్రామాలు ఏ సదుపాయాలు లేక అయోమయావస్థలో ఉన్నాయి. గ్రామాలలో చెరువులు ఆక్రమణదారుల పాలవుతుంటే, సహజవనరులయినా కొండలన్నీ కంకరగా తవ్వి తీసేస్తున్నారు. ఇసుక, కంకర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, నీళ్లు, ప్రభుత్వ , పోరంబోకు భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

పలాస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి