ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాంబిల్లి మండలం

రాంబిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 53,913 జనాభాతో విస్తరించి ఉంది. ఈ మండలంలో పురుషుల సంఖ్య 26,812 , స్త్రీల సంఖ్య 27,101. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 52.33% ఇందులో పురుషులు 62.49% మంది మరియు స్త్రీలు 41.95%.

ప్రధాన పంటలు

వరి, కొబ్బరి, జీడి

ఈ పట్టణ సమస్యలు:

 • తీర ప్రాంతంలో ఉన్న వారికి 55 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి. ఈ మేరకు జీ.వో, విడుదల అయ్యింది కానీ అమలు కావడం లేదు
 • తాగునీటి సమస్య వుంది
 • రైతుల భూములు నేవల్ బేస్ కోసం సేకరించారు
 • సముద్ర తీరం కారణంగా భూగర్భ జలాల్లో ఉప్పు నీరు అధికం
 • పంచదార్ల భౌద్ధారామం, రాంబిల్లి తీరం ( కొత్తపట్నం ) పర్యాటకంగా వృద్ధి చేయాలి
 • జూనియర్ కాలేజీ, ఐటిఐ కావాలి
 • నేవల్ బేస్ ఉన్నా ఉద్యోగాలు లేవు
 • వలసలు అధికం
 • ఎస్ఇజెడ్, నేవల్ బేస్ తదితర సంస్థలు ఉన్నందున సాంకేతిక వృత్తిలో యువతకు శిక్షణ ఇవ్వాలి
 • స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
 • మత్స్యకారుల గ్రామాలు అధికం, సమస్యలు కూడా అధికమే
 • ఈ మండలం అధికారింగా ఉందో? లేదో? తెలియని సందిగ్ధంలో ఉన్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు
ఎలమంచిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి