గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, పొన్నూరు ఒకటి. పూర్వం పొన్నూరు, స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, "పొన్నూరు"(పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. గుంటూరు జిల్లా లోని ముఖ్య పురపాలక సంఘాలలో, పొన్నూరు ఒకటి.
ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 208168 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 106349 కాగా మగవారి సంఖ్య 101806. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పత్తి మరియు మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. పొన్నూరులో అప్పడాల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది.
శ్రీ సాక్షి భావనారాయణస్వామివారి ఆలయం
సంస్కృత కళాశాల - శ్రీ సాక్షి భావనారాయణస్వామి దేవస్థానం ఆవరణలో 1937లో వేద పాఠశాలను స్థాపించారు. 1950 లో ఆ పాఠశాలను సంస్కృత కళాశాలగా మార్చారు.