ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

శృంగరాయవరం మండలం

ఎస్ రాయవరం (సర్వసిద్ధి రాయవరం) విశాఖపట్నం జిల్లా లో ఒక మండలం. ఇది గౌరవనీయులు శ్రీ గురుజాడ అప్పారావు గారు జన్మించిన స్థలం. తెలుగు భాషలో అయన గొప్ప కవి మరియు నాటక రచయిత. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 74,101 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 36,384, ఆడవారి సంఖ్య 37,717. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 51.28% ఇందులో పురుషులు 59.87% మంది మరియు స్త్రీలు 42.84%.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లాలోని. ఎస్ రాయవరం మండలం ప్రధాన కార్యాలయం. విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ఇది పశ్చిమ దిశగా 63 కి.మీ. దూరంలో ఉంది. ఉత్తర వైపు ఎలమంచిలి మండలం, తూర్పు వైపు రాంబిల్లి మండలం, పశ్చిమాన నక్కపల్లి మండలం, ఉత్తర వైపు కశింకోట మండలం ఎస్ రాయవరం మండలానికి సరిహద్దులలో ఉన్నాయి. ఎస్ రాయవరంలో 55 గ్రామాలు, 28 పంచాయితీలు ఉన్నాయి.

చిన ఉప్పల్లం అతి చిన్న గ్రామం మరియు ఎస్ రాయవరం అతిపెద్ద గ్రామం.

ఈ పట్టణ సమస్యలు:

 • గురజాడ జన్మించిన ఊరు కావడంతో మండలానికి గురజాడ పేరు పెట్టాలి
 • మినీ కోనసీమగా పేరొందిన ఎస్. రాయవరం నేవల బేస్ వల్ల తీర ప్రాంతం కనుమరుగవుతుంది
 • రేవు పోలవరం పర్యాటకంగా వృద్ధి చేయాలి
 • గురజాడ  కాంస్య విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి
 • స్మారక చిహ్నాన్ని నిర్మించాలి
 • గురజాడ పేరుతో ఆడిటోరియం కట్టాలి
 • జూనియర్ కాలేజీ, ఐటిఐ మంజూరు చేయాలి
 • పెట్రో రసాయన ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం
 • ఏటి కొప్పాక చక్కెర కర్మాగారం ఉన్నా ఉపాధి అవకాశాలు లేవు
 • కొబ్బరి సాగు 60 శాతం, జీడి, మామిడి 10 శాతం ఇక్కడ ఉంది
 • అడ్డు రోడ్డు, రేవు పోలవరం మధ్య రోడ్లు రెండేళ్లుగా పెండింగ్ వున్నాయి
 • తాగు నీటి సమస్య
 • రోడ్లు విస్తరించాలి
 • వరాహ నది కాలవలకు మరమ్మతులు చేయాలి. గ్రోయన్లు పోయాయి
 • పోలవరం ప్రాజెక్టు ఇక్కడ క్రాస్ అవుతుంది. ఆ నీరు మండలంలోని రైతులకు కేటాయించాలి
 • వైద్య సదుపాయాలు మెరుగుపడాలి.
పాయకరావుపేట నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి