ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆలస్యం, అమృతం, విషం: కాలుష్యంతో సతమతమౌతున్న విశాఖ పశ్చిమ తక్షణ కర్తవ్యం ఏంటి?

వేగంగా పెరుగుతున్న జనాభా, ఇతర ప్రాంతాలనుండి జీవనోఫాదికై వలసవచ్చే ప్రజలతో విశాఖ పశ్చిమ శివారు ప్రాంతం మురికివాడలుగా అవతరిస్తుంది. కనీసం జీవనం సాగించడానికి వీలుకాని తాత్కాలిక ఇళ్లలో నివసించే ఇక్కడి ప్రజలు కాలుష్యం, అనారోగ్యం అనే రెండు ప్రధాన సమస్యలతో సతమవుతున్నారు. గోపాలపట్నం, మల్కాపురం, కంచెరపాలెం, మర్రిపాలెం, ఎన్ ఏడి జంక్షన్లు విశాఖ పశ్చిమాన ఉన్న ప్రాంతాలు.

ఈ ప్రాంతాలలో వాహనాలనుండి వచ్చే కాలుష్యంతో బాటు, దాదాపు 300 కు పైగా ఉన్న ఆసుపత్రులు, డిస్పెన్సరీలనుండి వాడేసిన మెడికల్ వేస్ట్, పరిశ్రమల , కంపెనీల నుండి వెలువడే వ్యర్దాలు, ఇంకా ఇండ్ల నుండి సేకరించిన చెత్త వంటి వాటిని మహానగరపాలకసంస్థ కాపు ఉప్పాడ ప్రాంతంలో విసర్జిస్తున్నది. ఈ పని శాస్త్రీయ పద్దతులలో జరగకపోవడంతో వాటినుండి వెలువడే కాలుష్యం విషతుల్యంగా మారుతున్నది. దీనివలన భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడంతో బాటు, భవిష్యత్తులో మంచినీటి కొరత తీవ్రతరం చేస్తుందని అనేక పరిశోధనా పత్రాలు చెబుతున్నాయి.

వాహనాల కాలుష్యాన్ని అరికట్టడానికి వాహనాలనుడి వెలువడే పొగను వాహన కాలుష్య నిరోధక విభాగం నిరంతరం పర్యవేక్షిస్తూ, కాలుష్య కారకమైన బండ్లపై నిషేదం విధించాలి. పరిశ్రమలు, ఇండ్లనుండి తీసుకుని వెళ్లే హానికారకమైన వ్యర్ధాలను తీసుకువెళ్లే వాహనాలను జిపిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. కాలుష్యనివారణ సంస్థలన్ని సమన్వయంతో పనిచేస్తే, ఈ కాలుష్యాన్ని నివారించవచ్చు. వ్యర్ధాలను పర్యావరణానికి హానికలిగించని రీతిలో రీసైకిల్ చేసే మార్గాల అన్వేషణలోనే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ముఖ్యంగా, వ్యర్ధాలను ప్రజావాసాలకు దూరంగా, ఎక్కడ నిర్ములించాలి అనే అంశం కోసమే సంవత్సరాలు పడితే, కార్యాచరణకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం. ఈలోగా జరగవలసిన నష్టం జరిగితీరుతుంది. గతుకులమయమైన రహదారులు తీవ్రమైన మంచినీటి సమస్య, ఎక్కడపడితే అక్కడే పేరుకుపోయిన చెత్త, ప్రధాన సమస్యలు. భూగర్భ డ్రైనేజీలు లేక పోవడంతో మురుగు రోడ్లపైనే ప్రవహిస్తున్నది. డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. కూరగాయల వ్యాపారులకు కేటాయించిన స్థలంలో వారికి శాశ్వత దుకాణాలు నిర్మిస్తే, రైతులు, చిన్న వ్యాపారులు లాభపడుతారు.

వీధిదీపాలు పునరుద్ధరించి, ఇక్కడి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగుపరచాలి. అన్ని రకాల కాలుష్యాల మధ్య బ్రతికే స్థానిక ప్రజలు అంటూ వ్యాధులు, కాలుష్య సంబంధిత ఆరోగ్యసమస్యలతో నిరంతరం బాధపడుతున్నారు. వీరికి సరైన వైద్యం అందుబాటులో లేదు. ప్రవేట్ కార్పొరేట్ వైద్యం మురికివాడలో ప్రజలకు అందుబాటులో ఉండదు కాబట్టి నాణ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుల సేవలువీరికి అవసరం.

ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. కాలుష్య నివారణలో జరిగే ఆలస్యం అమృతమయంగా మారాల్సిన ప్రజాజీవనాన్ని విషంగా మారుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి